సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 జనవరి 2025 (14:43 IST)

అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మహిళపై గ్యాంగ్ రేప్ .. ఎక్కడ?

victim
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్రంలో నేరాలు ఘోరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, మహిళపై అత్యాచారాలు పెరుగుతున్నాయి. తాజాగా మెదక్ జిల్లా మసాయిపేట మండలంలో మతిస్థిమితం లేని మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సాక్షిగా ఈ దారుణం జరిగింది. అయితే, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 
 
మెదక్ జిల్లా మసాయి పేట మండలం రామంతాపూర్లో మతిస్థిమితం లేని మహిళపై అంబేద్కర్ విగ్రహ వెనుక గద్దెపై దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు. తప్పిపోయిన వేరే మహిళ కోసం రామంతపూర్ స్టేజి వద్ద హంస దాబాకు చెందిన సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు చూస్తుండగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ముగ్గురుని అదుపులోకి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, బాధితురాలు మతి స్థిమితం లేకపోవడంతో తన వివరాలను వివరాలు చెప్పలేకపోవడంతో.. మహిళను భరోసా సెంటర్‌కు పోలీసుల తరలించారు.