ఆదివారం, 13 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 23 మే 2023 (11:18 IST)

అర్థరాత్రి ఇంట్లో చొరబడి భర్తను మంచానికి కట్టేసి భార్య-కుమార్తెపై గ్యాంగ్ రేప్

rape
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. అర్థరాత్రి వేళ ముగ్గురు వ్యక్తులు ఓ ఇంట్లోకి చొరబడి మహిళ, ఆమె మైనర్ కుమార్తపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.
 
రాంపూర్ జిల్లా సైఫాని పోలీసు స్టేషను పరిధిలో ఓ మెకానిక్ అతడి భార్య-కమార్తెతో వుంటున్నారు. ఐతే శనివారం అర్థరాత్రి సమయంలో మెకానిక్ కుటుంబం నిద్రిస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. మెకానిక్ ను తాళ్లతో మంచానికి కట్టేసారు. ఆ తర్వాత అతడి భార్య, మైనర్ కుమార్తెపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
 
సమాచారం అందుకున్న పోలీసులు తల్లీకూతుళ్లను ఆసుపత్రికి తరలించారు. గతంలో మెకానిక్‌తో ముగ్గురు వ్యక్తులు గొడవపడ్డారనీ, దీని కారణంగానే వారు అఘాయిత్యానికి పాల్పడి వుంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.