గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 ఫిబ్రవరి 2024 (09:07 IST)

బహిర్భూమికి వెళ్లిన మహిళ.. లైగింకదాడికి పాల్పడిన బాలుడు...

victim
సమాజంలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోతుంది. తమ ఇళ్లతో పాటు బహిరంగ ప్రదేశాల్లో కూడా వారికి రక్షణ కరువైంది. తాజాగా బహిర్భూమికి వెళ్లిన ఓ మహిళపై మైనర్ బాలుడు లైంగికదాడికి తెగబడ్డాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరం మండలంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
వెస్ట్ గోదావరి జిల్లాలోని భీమవరం మండలంలో ఓ గ్రామానికి చెందిన మహిళపై 16 యేళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ బుధవారం ఉదయం బహిర్భూమికి ఒంటరిగా వెళ్లింది. దీన్ని గమనించిన బాలుడు ఆమె వెంట అనుసరించి లైంగికదాడికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా, ఈ దాడికి పాల్పడిన బాలుడు పాత నేరస్థుడు కావడం గమనార్హం. 
 
ఫ్రీజర్ బాక్సులో ఉంచిన మృతదేహానికి చీమలు... చీమల మందు తెచ్చుకొమ్మన్న సిబ్బంది.. ఎక్కడ?
 
అసలే కుటుంబ సభ్యురారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యుల పట్ల ఓ ఆస్పత్రి సిబ్బంది ప్రవర్తించిన తీరు వారిని మరింత విషాదానికి గురిచేసింది. పోస్టుమార్టం గదిలో ఫ్రీజర్‌ బాక్సులో ఉంచిన మృతదేహానికి చీమలు పట్టాయి. ఈ విషయాన్ని గమనించిన బంధువులు ఆస్పత్రి సిబ్బందిని నిలదీసి ఆస్పత్రి ఎదుటబైఠాయించారు. దీంతో ఆగ్రహించిన ఆస్పత్రి సిబ్బంది.. చీమల మందు తెచ్చి ఇవ్వాలంటూ మృతుని బంధువులకు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఈ దారుణ ఘటన ఏపీలోని కడప జిల్లాలో జరిగింది. మంగళవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ నెల 29వ తేదీన జమ్మలమడుగు బీసీ కాలనీలో 16 యేళ్ల బాలిక ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు కోల్పోయింది. జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రిలో శవపరీక్ష అదే రోజు చేయాల్సి ఉండగా, కొన్ని కారణాలతో మరుసటి రోజుకు వాయిదాపడింది. దీంతో మృతదేహాన్ని శవాలగదిలోని ఫ్రీజర్ బాక్సులో ఉంచారు. కుటుంబీకులు మంగళవారం ఉదయం వచ్చి చూడగా, మృతదేహం చుట్టూత చీమలు ఉన్నాయి. దీంతో ఆస్పత్రి సిబ్బందిపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రి సిబ్బంది వైఖరికి నిరసనగా ఆస్పత్రి ఆవరణలోనే బైఠాయించారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది కూడా చీమల మందుకొని తెచ్చివ్వాలంటూ దురుసుగా సమాధానమిచ్చారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు... అక్కడకు చేరుకుని మృతురాలి బంధువులకు సర్దిచెప్పారు.