శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: సోమవారం, 21 ఆగస్టు 2017 (14:12 IST)

నంద్యాల ఉప ఎన్నికల్లో శిల్పామోహన్ రెడ్డి గెలుపు సాధ్యమా..?

నంద్యాలలో వైసిపికి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి. ఇంతకీ శిల్పా మోహన్ రెడ్డిని చూసి ఓటేస్తారా.. లేక జగన్ రెడ్డిని ఓటేస్తారా..? పార్టీ ఫిరాయించిన వ్యక్తికి సీటివ్వడం వైసిపికి లాభమా..నష్టమా..? అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ ఎన్నికల్లో వైసిపి ఓడిపో

నంద్యాలలో వైసిపికి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి. ఇంతకీ శిల్పా మోహన్ రెడ్డిని చూసి ఓటేస్తారా.. లేక జగన్ రెడ్డిని ఓటేస్తారా..? పార్టీ ఫిరాయించిన వ్యక్తికి సీటివ్వడం వైసిపికి లాభమా..నష్టమా..? అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ ఎన్నికల్లో వైసిపి ఓడిపోతే జరుగబోయే పరిణామం ఎలాగుంటాయి. శిల్పామోహన్ రెడ్డి అభ్యర్థిత్వం బలమా.. బలహీనతా..? 
 
కర్నూలు జిల్లాలో ఫ్యామిలీ రాజకీయాలు రక్తికట్టిస్తూ ఉంటాయి. కొన్ని ఫ్యామిలీల మధ్య ఎక్కువగా రాజకీయం నడుస్తూ ఉంటుంది. మూడో వ్యక్తి మధ్యలోకి ఎంటరవ్వలేడు..అయినా ఎక్కువ కాలం నిలువలేడు. అందువల్లే ఆ కుటుంబాలే ఆధిపత్యం చలాయిస్తూ ఉంటాయి. అలాంటి కుటుంబాల్లో ఒకటి శిల్పా కుటుంబం. అన్నదమ్ములు ఇద్దరూ రాజకీయాల్లో ఉన్నప్పటికీ వీరి మధ్య అనేకసార్లు విభేధాలు వచ్చాయి. చివరకు చెరో పార్టీలో పనిచేసిన సంధర్భాలు కూడా ఉన్నాయి. 
 
మొన్నటి దాకా టిడిపిలో ఉన్న శిల్పామోహన్ రెడ్డి ఉప ఎన్నికలో అక్కడ సీటు రాదన్న ఉద్దేశంతో వైసిపిలో చేరారు. అయితే పార్టీ మారడం శిల్పామోహన్ రెడ్డిపై నంద్యాల ప్రజలు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు. శిల్పా గెలుపుకు తన వ్యక్తిగత ఇమేజ్ ఉపయోగపడుతుందా.. లేక పార్టీ బలంతోనే నెట్టుకురావాల్సిన పరిస్థితి ఉందా.. శిల్పా మోహన్ రెడ్డి మూడేళ్ళ పాటు అధికార పార్టీ అయిన టిడిపిలో ఉన్నారు. ఇక్కడ నుంచి భూమా నాగిరెడ్డి వైసిపి తరపున ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ అధికార పార్టీకి చెందిన నాయకుడిగా శిల్పా మోహన్ రెడ్డి చక్రం తిప్పేవారు. 
 
అంతేకాకుండా అనేక విధాలుగా భూమా కుటుంబం ఇబ్బందిపెట్టడం వల్ల చివరకు భూమా పార్టీ మారాల్సి వచ్చిందన్న వాదనలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా అనేక భూకబ్జాలకు పాల్పడ్డారని, ఫైనాన్స్ పేరుతో డబ్బులు దండుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ అధిగమించి శిల్పా గెలుపు గుర్రాలపై దూసుకు వెళతారో లేదో వేచి చూడాల్సి వుంది.