శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 9 అక్టోబరు 2020 (19:32 IST)

భారతీయ వినియోగదారులకు INR ధర విధానం ప్రకటించిన Zoom

యుఎస్ ఆధారిత, వీడియో-ఫస్ట్ యునిఫైడ్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారం, సంస్థ ఇకపై తాము భారతీయ రూపాయి (INR)ను భారతీయ మార్కెట్‌కు స్థానిక ధరగా ఆమోదించనున్నామని ఈ రోజు తెలిపింది. తన ప్రాభవాన్నివిస్తరించేందుకు, ప్రేక్షకలోకానికి దగ్గరయ్యేందుకు, ఈ అవకాశం భారతదేశంలోని వినియోగదారులు తమకిష్టమైన ప్లాన్‌లను, వాటిపై లభ్యమయ్యేవాటిని కూడా కొనుగోలు చేసుకోవచ్చు.
 
వినియోగదారులు, ఇప్పుడు భారతదేశం తమ బిల్లింగ్, INRలో కొనుగోలు చేసేందుకు క్రెడిట్ కార్డ్ ఎంపికను ఉపయోగించవచ్చు. ప్రారంభ దశలో, వినియోగదారులు వెబ్ బ్రౌజర్ ద్వారా చేసిన కొనుగోలులో Zoom Phone SKU వీక్షించడం లేదా కొనుగోలు చేయడానికి పరిమితి చేయబడుతుంది. ఈ ప్రకటనతో జూమ్ ఇప్పటికే దేశంలోని ముంబాయిలో ఒక కార్యాలయం, ముంబాయి, హైదరాబాద్‌లలో రెండు డేటా సెంటర్లతోపాటు, బెంగుళూరులో ప్రారంభం కాబోయే టెక్నాలజీ సెంటర్ ద్వారా అందిస్తున్న సేవలను మరింత విస్తరింపచేయటానికి, విధాత్మకంగా పెట్టుబడులు పెట్టేందుకు చూపుతున్న చొరవకు తార్కాణంగా నిలుస్తుంది.
 
ఈ విషయాన్ని ప్రకటించిన జూమ్ ఇండియా అధికారి సమీర్ రాజే మాట్లాడుతూ, “భారతదేశంలోని మా వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు, INR కొనుగోలు ఎంపికను ప్రకటించేందుకు మేము ఎంతో ఉత్సుకతతో ఉన్నాము. గత కొద్ది నెలలుగా, భారతీయ మార్కెట్ నుండి మేము విశేషమైన మద్దతు, పెరుగుదలను సాధించాము.
 
భారతీయ కరెన్సీకి మద్దతివ్వాలనే మా ఆలోచనకు ప్రధాన కారణం, కస్టమర్లు మాపట్ల కలిగివున్న విశ్వాసం. ఇది మాలో పెంచిన విశ్వాసంతో రాబోయే కాలంలో మేము మరింత ఉత్తమమయిన, మరింత కనెక్టెడ్ సేవలు అందించగలమనే నమ్మకం ఉంది. Zoom కు భారతీయ మార్కెట్ ఎంతో ప్రధానమైన మార్కెట్‌గా కొనసాగడంతోపాటు, మేము కూడా ఇది ఒక భారతీయ కంపెనీగా ఎదగాలనే పట్టుదలతో ఉన్నాము” అని చెప్పారు.