శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 14 సెప్టెంబరు 2020 (16:42 IST)

Zoom ప్రవేశపెడుతోంది అదనపు భద్రతకై రెండు-కారకాల ప్రామాణీకరణ(2FA)

వీడియో ఫస్ట్ యూనిఫైడ్ కమ్యూనికేషన్స్‌లో ప్రముఖ సంస్థ, Zoom వీడియో కమ్యూనికేషన్స్ అడ్మిన్‌లు మరియు సంస్థలు తమ యూజర్లను రక్షించేందుకు మరియు ప్లాట్‌ఫారం నుండే భద్రతా ఉల్లంఘననలను నివారించే ఉన్నతీకరించబడిన రెండు-కారకాల ప్రామాణీకరణ (2FA) ను ప్రవేశపెడుతోంది.
 
రెండు-కారకాల ప్రామాణీకరణ, ఆన్‌లైన్ యూజర్లను, ఆ నిర్ధారిత అక్కౌంట్‌కు వారి యాజమాన్యాన్ని అథెంటికేట్ చేసే, యూజర్‌కు తెలిసినవి (ఒక పాస్‌వర్డ్ లేదా పిన్), యూజర్ దగ్గర వుండేవి (ఒక స్మార్ట్ కార్డ్ లేదా మొబైల్ డివైజ్) లేదా వేరే ఏదైనా యూజర్ కలిగివుండేవి (వ్రేలిముద్రలు లేదా స్వరం) వంటి రెండు లేదా అంతకంటే ఎక్కువ వాటిని సమర్పించడం ద్వారా గుర్తిస్తుంది.
 
Zoom 2FA వల్ల లాభాలు
Zoom 2FAలోని యూనిఫైడ్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారం, యూజర్లను భద్రంగా వాలిడేట్ చేసేందుకు మరియు భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించకుండా రక్షించడంతోపాటు, కింద తెలిపిన మరెన్నో ఉపయోగాలను కూడా అందిస్తుంది. వీటిలో ఏమేమి వుంటాయో తెలుసుకుందాం
 
పెంచబడిన భద్రత: 2FAతో, సంస్థ గుర్తింపు చౌర్యానికి గురికాకుండా రక్షించబడేందుకు, అదనంగా మరొక భద్రతా వలయం పెంచబడినందున, పాస్‌వర్డ్‌లను ఊహించి లేదా ఉద్యోగుల లేదా విద్యార్థుల డివైజ్‌లకు యాక్సెస్ పొందడం ద్వారా, వారి అక్కౌంట్లకు యాక్సెస్ పొందాలనుకొనే తప్పుడు ఆలోచనలనుండి రక్షణ కలుగుతుంది.
 
పెంచబడే ప్రామాణికత: 2FAను అమలు పరచడంద్వారా సంస్థలు, సున్నితమైన డేటా మరియు వినియోగదారుల సమాచారానికి సంబంధించి ప్రామాణికతా పరమైన చిక్కులను నివారించవచ్చు.
 
తగ్గిపోయే ధరలు: చిన్న వ్యాపార సంస్థలు, పాఠశాలలు, SSO సర్వీసుకు అధికంగా చెల్లించవలసి ఉంటుంది. Zoom’s 2FA, యూజర్లను ఉచితంగా, ప్రభావవంతంగా వాలిడేట్ చేయడమే కాక, భద్రతా ఉల్లంఘనల నుండి కూడా రక్షణ అందిస్తుంది.
 
సులభమైన క్రెడెన్షియల్ నిర్వహణ: యూజర్లను నిరంతర పాస్‌వర్డ్ నిర్వహణ నుండి రక్షించడంతోపాటు, ఒక అదనపు భద్రతా వలయాన్ని కూడా అందిస్తుంది.
 
Zoom 2FAతో, యూజర్లు టైమ్-బేస్డ్ వన్-టైమ్ పాస్‌వర్డ్‌ ప్రొటోకాల్ (TOTP) (Google Authenticator, Microsoft Authenticator, మరియు FreeOTP)కు మద్దతిచ్చే అథెంటికేషన్ యాప్‌లు  ఉపయోగించే లేదా SMS లేదా ఫోన్ కాల్‌ద్వారా Zoom మీకు ఒక కోడ్ పంపే ఐఛ్ఛికాన్ని అందిస్తుంది.
 
Zoom 2FA ఎనేబుల్ చేసుకోవడమెలా
ఒక అక్కౌంట్‌కు వ్యక్తిగతంగా ఎనేబుల్ లేదా డిజేబుల్ చేసుకోవడానికి, Zoom అందించే SAML, OAuth మరియు/లేదా పాస్‌వర్డ్ ఆధారిత అథెంటికేషన్ వంటి విస్తృత శ్రేణిలోని అథెంటికేషన్ విధానాలను అందిస్తోంది. Zoom 2FAను పాస్‌వర్డ్-ఆధారిత అథెంటికేషన్‌కు అక్కౌంట్-స్థాయిలో ఎనేబుల్ చేసుకోవడానికి అక్కౌంట్ అడ్మిన్‌లు కింద తెలిపిన విధంగా చేయాలి:
 
* Zoom డాష్‌బోర్డ్‌కు సైన్-ఇన్ అవ్వండి
* నావిగేషన్ మెనూలో, Advancedపై క్లిక్ చేసి, ఆ తరువాత, Securityపై క్లిక్ చేయాలి
* మీరు రెండు-కారకాల ప్రామాణీకరణ ఎనేబుల్ అయివున్న ఐఛ్ఛికంతో సైన్-ఇన్ అయ్యారని నిర్ధారించుకోండి.
* 2FAను ఎనేబుల్ చేసుకోవడానికి కిందివాటిలో ఒక ఐఛ్ఛికాన్ని ఎంచుకోండి:
* మీ అక్కౌంట్‌లోని యూజర్లందరూ: అక్కౌంట్‌లోని యూజర్లందరూ 2FAను ఎనేబుల్ చేసుకొని ఉండాలి.
* ప్రత్యేక roles లోని యూజర్లు: కొన్ని ప్రత్యేక roles లోని వారికి 2FA ఎనేబుల్ చేయండి. నిర్ధారిత Select హోదాలపై క్లిక్ చేయండి, హోదాలను ఎంపిక చేయండి, ఆపై OKపై క్లిక్ చేయండి.
* కొన్ని నిర్ధారిత groupsకు చెందిన యూజర్లు: కొన్ని నిర్ధారిత groupsలో ఉన్న యూజర్లను ఎనేబుల్ చేయండి. పెన్సిల్ ఐకాన్‌పై క్లిక్ చేసి, groupsను ఎంచుకొని, ఆ తరువాత OKపై క్లిక్ చేయండి.
* మీ 2FA సెట్టింగ్‌లను నిర్ధారించేందుకు Saveపై క్లిక్ చేయండి.
 
Zoom 2FA గురించి మరింత తెలుసుకోవడానికి, మరియు దానిని మీ సంస్థలోని యూజర్లకు ఎనేబుల్ చేయడానికి, support pageని సందర్శించండి.