1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 28 జులై 2014 (17:35 IST)

ఆరోగ్యాన్ని ప్రసాదించే తృణధాన్యాలు!

ఫాస్ట్ ఫుడ్ కల్చర్‌‌తో రోగాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఆరోగ్యంగా ఉండాలంటే బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఆరోగ్యం కోసం తృణధాన్యాలను తీసుకోవాల్సిందేనని వారు సూచిస్తున్నారు. బియ్యం, గోధుమలు, బార్లీ, రాగి, సజ్జలు, మొక్కజొన్న వంటి ధాన్యాలను ఉడికించి తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఒబిసిటీ దూరమవుతుంది.  
 
సజ్జలు, మొక్కజొన్న, రాగి తీసుకోవడం ద్వారా గుండె పోటు దరిచేరదు. సజ్జలు ఫాస్పరస్, పీచు వంటి పదార్థాలు పుష్కలంగా ఉంది. ఇవి ఫ్యాట్‌ను కరిగించి ఒబిసిటీకి చెక్ పెడుతుంది. రాగిలో ఉండే ఐరన్ మహిళల్లో నెలసరి సమస్యలను దూరం చేస్తుంది. ఒకే రకమైన బియ్యం కాకుండా ఎరుపు బియ్యం వంటివి కూడా అప్పడప్పుడు ఆహారంలో చేర్చుకోవాలి. దంచుడు బియ్యాన్ని తీసుకుంటే ఆరోగ్యానికి ఢోకా ఉండదు. 
 
ఇక గోధుమలో షుగర్, ఫాస్పరస్, ఐరన్ వంటి శక్తులు పుష్కలంగా ఉన్నాయి. గోధుమలతో చేసిన వంటకాలను పిల్లల నుంచి పెద్దల వరకు తీసుకోవచ్చు. బార్లీని రోజూ ఒక గ్లాసుడు తీసుకుంటే నాజూగ్గా తయారవుతారు. శరీరంలోని అనవసరపు నీటిని ఇది దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.