శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Updated : బుధవారం, 19 జులై 2023 (23:33 IST)

గొంతు నొప్పి, మింగడం కష్టం, గొంతు క్యాన్సర్ లక్షణాలు ఏంటి?

Throat
క్యాన్సర్. ఈ ప్రాణాంతక వ్యాధి మానవ శరీరంలో ఏ అవయానికైనా రావచ్చు. ముఖ్యంగా క్యాన్సర్లరో గొంతు క్యాన్సర్ కూడా ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీని లక్షణాలు ఏమిటో తెలుసుకుందాము. పురుషుల్లో గొంతు క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది. గొంతు క్యాన్సర్ జ్వరం, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో కష్టం వంటి వాటితో మొదలవుతుంది.
 
శ్వాస తీసుకునే సమయంలో గురక, దగ్గు, కఫం గొంతు క్యాన్సర్ యొక్క ప్రారంభ లక్షణాలు. దగ్గుతున్నప్పుడు రక్తం పడటం, ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన గొంతు నొప్పి వుంటుంది. గొంతు బొంగురుపోతుంది, మూడు లేదా నాలుగు వారాల తర్వాత స్వరం సాధారణ స్థితికి వస్తుంటుంది.
 
మెడ, చెవుల చుట్టూ నొప్పి. రెండు లేదా మూడు వారాల యాంటీబయాటిక్స్ వాడితే తగ్గుతుంది.
మెడలో వాపు లేదా గడ్డలు ఏర్పడుతాయి, ఇలాంటివి గొంతు క్యాన్సర్ ప్రధాన లక్షణాలుగా కనిపిస్తాయి. ప్రారంభ దశలోనే చికిత్స చేస్తే గొంతు క్యాన్సర్ నయం అవుతుంది