మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By
Last Updated : మంగళవారం, 13 నవంబరు 2018 (15:03 IST)

స్వైన్ ఫ్లూ ఎలా వస్తుందో తెలుసా..?

ఈ కాలంలో అందరినీ ఎక్కువగా ఆందోళనకు గురిచేసే వ్యాధి స్వైన్ ఫ్లూ. రోజురోజూకీ ఈ వ్యాధి పెరుగిపోతుంది. అంతేకాకుండా రోజుకో కేసు నమోదవుతుంది. ఇలాంటి సమస్యల్లో చిక్కుకోకుండా ఉండాలంటే.. కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం...
  
 
చేతులకు మురికి లేకుండా చూసుకోవాలి. ఇతరులతో చేయి కలిపిన ప్రతిసారి చేతులను సబ్బుతో శుభ్రపరచాలి. తుమ్ము, దగ్గు వచ్చినప్పుడు ముక్కు, నోరు దగ్గర అడ్డం పెట్టుకున్న చేతులను వెంటనే కడుక్కోవడం అవసరం. అలా కడుక్కోకుంటే చేతులతో కళ్లు, ముక్కు, నోటిని అసలు తాకవద్దు. 
 
ఇతరత్రా బలహీనంగా ఉన్నప్పుడు అంటు వ్యాధులు సులభంగా సోకుతాయి. కాబట్టి పోషక పదార్థాలతో కూడిన ఆహారాలు తీసుకోవాలి. శరీరానికి తగినంత నీటిని అందించాలి. నిద్ర, విశ్రాంతి విషయంలో అశ్రద్ధ ఎంతమాత్రం మంచిది కాదు. 
 
ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా స్వైన్ ప్లూ సోకవచ్చు. ఆ రోగ లక్షణాలైన శ్వాసక్రియ ఇబ్బంది, నీరు తాగాలని అనిపించకపోవడం, అతిగా నిద్ర, చిరాకు, జ్వరం వంటివి కనిపించినపుడు వెంటనే వైద్య పరీక్ష చేయించుకోవాలి.