శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 23 మార్చి 2018 (11:40 IST)

వేసవిలో ఉసిరికాయ తింటే?

వేసవిలో ఉసిరికాయ తినడం వల్ల చలువ చేస్తుంది. శరీరాన్ని వేడి తాపం నుంచి తప్పిస్తుంది. ఉసిరిలో 80 శాతం నీరూ కొద్దిపాళ్లలో ప్రొటీన్లు వుంటాయి. అలాగే ఉసిరిలో పిండిపదార్థాలూ పీచు అధింగా వుంటాయి. క్యాల్షియం,

వేసవిలో ఉసిరికాయ తినడం వల్ల చలువ చేస్తుంది. శరీరాన్ని వేడి తాపం నుంచి తప్పిస్తుంది. ఉసిరిలో 80 శాతం నీరూ కొద్దిపాళ్లలో ప్రొటీన్లు వుంటాయి.

అలాగే ఉసిరిలో పిండిపదార్థాలూ పీచు అధింగా వుంటాయి. క్యాల్షియం, ఐరన్ పుష్కలంగా వుంటాయి. కాలేయవ్యాధులకు ఉసిరి అద్భుతమైన మందు. శరీరంలోని విషతుల్యాలలను తొలగిస్తుంది.
 
నాడుల్ని బలోపేతం చేస్తుంది. ఇంకా మెదడుపనితీరును మెరుగుపరుస్తుంది. నాడుల్ని బలోపేతం చేయడం ద్వారా మెదడుపనితీరుని మెరుగుపరుస్తుంది. ఉసిరి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. రుతుసమస్యల్ని తొలగించి సంతానోత్పత్తి సామర్థ్యాన్నీ పెంచుతుంది.

ఉసిరిముద్దని తలకి పట్టించి స్నానం చేస్తే కంటి మంటలు తగ్గుతాయి. ఉసిరి కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. భోజనం తర్వాత ఉసిరికాయను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.