శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 జూన్ 2020 (20:33 IST)

మెదడుకు పని చెప్తున్నారా? ఐతే రోజూ ఆపిల్ తినాల్సిందేనట.. (Video)

Apple
ఆపిల్‌లో పీచు పదార్థాలు పుష్కలంగా వున్నాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. అలాగే హృద్రోగ వ్యాధులకు చెక్ పెడుతుంది. రోజుకో ఆపిల్ తీసుకోవడం ద్వారా రక్తపోటును దరిచేర్చదు. మెదడుకు శక్తినిస్తుంది. అందుకే మెదడుకు ఎక్కువ పనిచెప్పేవారు.. తప్పకుండా ఆపిల్ తీసుకోవాలని వైద్యులు చెప్తున్నారు. 
 
ఆపిల్‌లో వుండే పెక్టిన్ అనే కరిగే పీచు ద్వారా చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. ఆపిల్‌లోని విటమిన్ సి.. శరీరానికి కావలసిన వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. కంటికి ఆపిల్ పండ్లు ఎంతగానో మేలు చేస్తాయి. కనీసం మూడు నెలల పాటు ఆపిల్‌ను రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, నరాలకు సంబంధించిన వ్యాధులన్నీ తగ్గుముఖం పడుతాయి. 
 
ఆపిల్‌ను తినడం లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడం ద్వారా శరీర బరువు తగ్గుతుంది. ఆపిల్‌లోని ధాతువులు శరీరంలోని ఎముకలకు బలాన్నిస్తాయి. ఆపిల్‌లో వున్న కొల్లాజెన్, ఎలాస్టిన్ వంటివి చర్మానికి మేలు చేస్తాయని న్యూట్రీషియన్లు చెప్తున్నారు.