శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 జూన్ 2020 (18:46 IST)

వేసవి కాలంలో చల్లచల్లని మజ్జిగను తాగితే?

రోజూ ఓ గ్లాస్ చల్లచల్లని మజ్జిగ తాగితే ఎండాకాలం ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఎండాకాలం చాలామందికి వేడి చేస్తుంది. ఆ వేడిని తగ్గించుకోవడానికి కూడా మజ్జిగను తాగొచ్చు. అందుకే.. మిట్టమధ్యాహ్నం వాతావరణం వేడిగా ఉన్నప్పుడు మజ్జిగ తాగితే పొట్ట చల్లగా ఉంటుంది.
 
ముఖ్యంగా మజ్జిగలో నిమ్మరసం కలుపుకొని తాగితే ఎండదెబ్బ తాకే ప్రమాదం ఉండదు. దాంతో పాటు వేసవి తాపం కూడా తీరుతుంది. డీహైడ్రేషన్ కాకుండా ఉంటారు. మజ్జిగలో ప్రొటీన్స్, మినరల్స్ లాంటి ఖనిజాలు ఉంటాయి. అవి చాలా ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. 
 
అంతే కాదు.. కాల్షియం లోపంతో బాధ పడేవాళ్లు మజ్జిగను తాగితే వాళ్ల ఎముకలు, దంతాలు కూడా దృఢపడతాయి. రోజూ మజ్జిగను తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గ్యాస్, అజీర్తి సమస్యలతో బాధపడేవాళ్లు కూడా మజ్జిగను రోజూ తాగొచ్చు. ముఖ్యంగా ఊబకాయంతో సతమతమయ్యేవారు ప్రతి రోజు మజ్జిగను సేవిస్తుంటే ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 
మజ్జిగలోనున్న ల్యాక్టిక్ ఆమ్లం ఉండటంతో శరీరంలో కొవ్వు పెరగకుండా నిరోధిస్తుంది. శరీరం అనారోగ్యం పాలు కాకుండా కాపాడేందుకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మజ్జిగలో లాక్టోజ్ మరియు కార్బోహైడ్రేట్స్ రోగనిరోధక శక్తి పెరుగుపడేలా చేస్తుంది. శరీరానికి కావల్సిన శక్తినిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.