గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: శనివారం, 6 జూన్ 2020 (21:27 IST)

కలబందతో ఆరోగ్యం, అందం

1. ఉదయం పరగడుపున కలబంద ఆకులను సేవిస్తే ఉదర సంబంధమైన సమస్యలుంటే తొలగిపోతాయి.
 
2. రోజ్ వాటర్‌లో కలబంద రసాన్ని కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని చర్మంపై పూస్తే పొడిబారిన చర్మం తిరిగి కళకళలాడుతుంది. 
 
3. కలబంద రసంలో ముల్తానీ మట్టి లేక చందనపు పొడి కలుపుకుని ముఖంపైనున్న మొటిమలకు పూస్తే మొటిమలు తగ్గిపోతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
 
4. కలబంద ఆకుల రసంలో కాసింత కొబ్బరి నూనె పోసి కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని మోచేతులు, పాదాల వద్ద నల్లగా ఉన్న ప్రాంతాలలో పూయండి. కాసేపటి తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. దీంతో చర్మంపైనున్న నల్లటి మచ్చలు తగ్గుతాయి.