బాదాం జిగురు ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే..?
బాదాం జిగురు ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. బాదాం జిగురులో చర్మానికి, ఎముకలకు కావలసిన ధాతువులు పుష్కలంగా వున్నాయి. బాదాం జిగురును రోజు లేదా వారానికి మూడుసార్లు తీసుకోవడం ద్వారా చర్మానికి, ఎముకలకు కావాలసిన ధాతువులు పూర్తిగా అందుతాయి. ముఖ్యంగా వేసవిలో శరీర తాపాన్ని తగ్గించేందుకు బాదాం జిగురు బాగా ఉపయోగపడుతుంది.
బాదాం జిగురును నీటిలో గంట పాటు నానబెట్టి తీసుకుంటే శరీర వేడి తగ్గుతుంది. అంతేగాకుండా బరువు తగ్గాలనుకునే వారికి బాదం జిగురు దివ్యౌషధం లాంటిది. అంతేగాకుండా బరువు పెరగాలనుకునే వారికి కూడా ఇది ఉపకరిస్తుంది.
అయితే బాదాం జిగురును పాలలో వేసుకుని తాగితే బరువు పెరుగుతుంది. బాదాం జిగురును నీటిలో నానబెట్టి వారానికి మూడు సార్లు తీసుకుంటే శరీరానికి బలం చేకూరుతుంది. అనారోగ్యం నుంచి కోలుకుంటారు. వ్యాధులు దరిచేరకుండా వుండేందుకు వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే కిడ్నీ సంబంధిత రోగాలు దరిచేరవు. వేసవి డీ-హైడ్రేషన్ కాకుండా వుండాలంటే.. బాదాం జిగురును జ్యూస్‌ల్లో కాసింత చేర్చడం మంచి ఫలితాలను ఇస్తుంది.