ఆదివారం, 5 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (11:18 IST)

మొక్కజొన్న నూనెతో మేలెంతో తెలుసా? పొట్ట కూడా ఇలా తగ్గిపోతుంది..

మొక్కజొన్నలో ఆరోగ్యానికి, చర్మానికి మేలు చేసే గుణాలున్నాయి. ఇందులో ఫైబర్, లో-ఫ్యాట్ ఆరోగ్యానికి మేలు చేస్తారు. జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు తోడ్పడతాయి. మొక్కజొన్నలోని సాల్యుబల్ ఫైబర్ కొలెస్ట్రాల్‌ను

మొక్కజొన్నలో ఆరోగ్యానికి, చర్మానికి మేలు చేసే గుణాలున్నాయి. ఇందులో ఫైబర్, లో-ఫ్యాట్ ఆరోగ్యానికి మేలు చేస్తారు. జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు తోడ్పడతాయి. మొక్కజొన్నలోని సాల్యుబల్ ఫైబర్ కొలెస్ట్రాల్‌ను కరిగించేందుకు సహకరిస్తుంది. తద్వారా పొట్ట తగ్గుతుంది. మొక్కజొన్న డయేరియా వంటి రుగ్మతలను దూరం చేస్తుంది. మొక్కజొన్నలోని బీ12, ఫోలిక్ యాసిడ్ రక్తహీనతను దరిచేరనివ్వదు. అలాగే మొక్కజొన్నలో ఐరన్ పుష్కలంగా వుండటంతో శరీరానికి కావలసిన శక్తి సులభంగా అందుతుంది. 
 
మధుమేహం, బీపీ వున్న వారు రోజుకు పావు కప్పు మొక్కజొన్నను తీసుకుంటే డయాబెటిస్‌ను నియంత్రించుకోవచ్చు. మొక్కజొన్నలోని విటమిన్ ఎ, బీటా-కెరోటిన్ కంటి చూపును మెరుగుపరుస్తుంది. యాంటీ-క్యాన్సర్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. మొక్కజొన్న నూనె గుండెకు మేలు చేస్తుంది. అలాగే కార్న్‌లో వుండే విటమిన్ సి చర్మానికి మెరుగునిస్తుంది. ఇంకా మొక్కజొన్నలోని యాంటీ యాక్సిడెంట్లు, థయామిన్, నియాసిన్ వంటివి చర్మానికి మేలు చేస్తాయి.
 
పసుపు రంగు గింజలతో కూడిన మొక్కజొన్నలో మినరల్స్ అధికంగా ఉంటాయి. వీటిలో ఉండే మెగ్నీషియం, ఐరన్, కాపర్, పాస్పరస్ ఎముకలకు బలాన్నిస్తాయి. మొక్కజొన్నలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. ఈ విత్తనాలతో చేసిన నూనెను చర్మానికి రాస్తే చర్మ సమస్యలుండవు. మొక్కజొన్న గర్భిణీ మహిళలకు ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని ఫోలిక్ యాసిడ్ కాళ్లు, చేతులు వాపురాకుండా నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.