శుక్రవారం, 1 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 31 మే 2023 (16:30 IST)

వేసవి కాలంలో శరీర దుర్గంధం వదలాలంటే...

body ordor
సాధారణంగా వేసవి కాలంలో చమట కారణంగా శరీర దుర్గంధం సర్వ సాధారణం ఉంటుంది. అయితే ఈ దుర్గంధాన్ని వదిలించుకోడానికి కొన్ని విరుగుడులున్నాయి. అవేంటంటే....
 
డియోడరెంట్ : వేసవిలో మీ ఒంటికి సరిపడే డియోడరెంట్‌ను ఎంచుకోవాలి. కొన్ని డియోడరెంట్స్ చమటతో కలిసినప్పుడు దుర్గంధాన్ని పెంచుతాయి. కాబట్టి వాటిని ఆచితూచి ఎంచుకోవాలి.
 
స్వేదం ఎక్కువగా విడుదలయ్యేవాళ్లు దుస్తులను తరచూ మారుస్తూ ఉండాలి. ఉదయం ధరించిన దుస్తులను సాయంత్రం ధరించకూడదు. దుస్తులను ఉతికే నీళ్లలో వెనిగర్ కలిపితే దుస్తుల దుర్గంధం పోతుంది. 
 
పాలియస్టర్ దుస్తులు బ్యాక్టీరియాను ఆకర్షించి, శరీర దుర్గంధాన్ని పెంచుతాయి. కాబట్టి వేసవిలో కాటన్ దుస్తులనే ఎంచుకోవాలి. సల్ఫర్ కలిగి ఉండే ఉల్లి, బ్రొకొలి, కాలిఫ్లవర్, క్యాబేజీలను తక్కువగా తినాలి.
 
ఉపయోగించే పర్ఫ్యూమ్ లేదా కొలోన్లను స్వీట్ ఆల్మండ్ ఆయిల్ లేదా ఇతర ఎసెన్సియల్ ఆయిల్స్‌తో కలిపి వాడడం వల్ల సుగంధం ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది.