Daily Horoscope
✕

ఎముకలకు బలాన్నిచ్చే మునగాకు, రాగులు.. (వీడియో)

ఎముకల బలం కోసం క్యాల్షియం తగిన మోతాదులో తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎముకలు శరీరానికి ఆధారం. అలాంటి ఎముకలు అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవాలంటే.. పాలను ఎక్కువగా తీసుకోవాలి. శరీరాని

Written By selvi
Updated: శుక్రవారం, 3 నవంబరు 2017 (18:40 IST)
ఎముకల బలం కోసం క్యాల్షియం తగిన మోతాదులో తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎముకలు శరీరానికి ఆధారం. అలాంటి ఎముకలు అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవాలంటే.. పాలను ఎక్కువగా తీసుకోవాలి. శరీరానికి విటమిన్-డి లభించే ఆహారం కూడా తీసుకోవాలి. ఎముకలు బలంగా ఉండాలంటే.. రోజూ ఉదయం, రాత్రి పావు టీ స్పూన్‌ దాల్చిన చెక్కను మెత్తని చూర్ణంగా చేసి పాలల్లో కలిపి తాగడం మంచిది. అలాగే కప్పు వేడిపాలలో టీ స్పూన్‌ నువ్వుల పొడిని కలిపి రోజుకు మూడుసార్లు తాగుతుంటే ఎముకలు బలపడతాయి. 
 
అంతేగాకుండా మునగ ఎముకలకు బలాన్నిస్తాయి. మునగ కాయలతో పులుసు చేసుకుని తింటే ఎముకలకు బలం చేకూరుతుంది. కాల్షియం ఎక్కువగా ఉండే మునగ ఆకులతో కూరను, పువ్వులతో చట్నీ చేసుకుని తింటే ఎముకలు బలపడతాయి. ఎనిమిది బాదం గింజలు నీటిలో నానబెట్టి ఉదయాన్నే వాటిపై పొరలు తీసి ఆవుపాలలో కలిపి నూరి గ్లాసు పాలతో తాగాలి. 
 
ఇంకా గ్లాసు పాలల్లో అల్లం రసం, తేనెలను ఒక టీ స్పూన్‌ చొప్పున కలిపి తాగడం ద్వారా ఎముకలను బలంగా వుంచుకోవచ్చు. కాల్షియం అధికశాతంలో ఉండే రాగుల వాడకం ద్వారా ఎముకలను బలంగా వుంచుకోవచ్చు. దీనిలో పీచుపదార్థాం కూడా ఉండటం ద్వారా క్యాన్సర్ దరిచేరదు. పాలకంటే రాగుల్లోనే కాల్షియం ఎక్కువ. రాగులతో పిండివంటలు, జావ, అంబలి లేదా రాగిమాల్ట్‌ తయారు చేసుకుని వారానికి రెండుసార్లైనా తీసుకుంటే ఎముకలు బలపడతాయి.
 
ఎముకల దృఢత్వానికి తగినంత శారీరక శ్రమ, వ్యాయామం కూడా అవసరమే. దీంతో ఎముకలపై ఒత్తిడి పడి వాటి లోపలి భాగానికి క్యాల్షియం చేరుకుంటుంది. అందువల్ల క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం మంచిది. వేగంగా నడవటం, పరుగు, మెట్లు ఎక్కటం వంటివన్నీ ఎంతో మేలు చేస్తాయి. ఒంటికి ఎండ తగిలినపుడు చర్మం తనకు తానుగానే విటమిన్‌ డి స్వీకరిస్తుంది. అందుచేత గంటల పాటు కూర్చోకుండా.. ఎండపడేలా పది నిమిషాలు బయట తిరగాలి.

అన్నీ చూడండి

సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక రైళ్లు

ఓయో హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి - తెల్లవారుజామున ఏం జరిగింది?

సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పిన సీఎం విజయ్ సర్కారు.. ఎందుకో తెలుసా?

యువతిపై సామూహిక అత్యాచారం... ముగ్గురి సహోద్యోగుల అరెస్టు

ఢిల్లీ కేఫ్‌లో యువతిపై సామూహిక అత్యాచారం.. సహోద్యోగులే నిందితులు.. మద్యం తాగుతూ..?

అన్నీ చూడండి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రవి కిషన్, నగ్మా లవ్ స్టోరీ

ఊర్వశి రౌతేలాకు తగ్గుతున్న క్రేజ్.. నోరా ఫతేహికి పెరుగుతున్న క్రేజ్

Vishwak Sen : మా జీవితమే ఈఎన్‌ఈ రిపీట్, యూఎస్‌లో బ్రేక్ ఈవెన్ :విశ్వక్ సేన్

Sharwanand: నేను కూడా విజయ్‌లా సీఎం అవుతానేమో: భోగి ప్రి-రిలీజ్ మీట్లో శర్వా

Niharika Konidela :పాకెట్ రాకెట్స్ చిత్రం నుంచి అప్సర అంటూ సాగే ఇల్యూష‌న్‌ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments