అసంతృప్తి ఒక మాయరోగం...

సాధారణంగా అసంతృప్తి అనేది ఓ రోగం. దాన్ని నిర్లక్ష్యం చేస్తే పెరిగిపోతుంది. ఏ విషయంలో మనకు అసంతృప్తి కలిగిందో ఆ విషయం గురించి మనం ఆలోచించడం మానేయాలి. ఎందుకంటే మనకి ఉన్నదానికన్నా లేనివాళ్ళు కూడా చాలా మం

Written By pnr
Updated: శుక్రవారం, 3 నవంబరు 2017 (14:48 IST)
సాధారణంగా అసంతృప్తి అనేది ఓ రోగం. దాన్ని నిర్లక్ష్యం చేస్తే పెరిగిపోతుంది. ఏ విషయంలో మనకు అసంతృప్తి కలిగిందో ఆ విషయం గురించి మనం ఆలోచించడం మానేయాలి. ఎందుకంటే మనకి ఉన్నదానికన్నా లేనివాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని గుర్తించాలి. పైగా, మనకంటే బాగా ఉన్నవారు కూడా ఆనందంగా ఉన్నారని చెప్పలేం. అందువల్లే అసంతృప్తి ఒక మాయరోగం వంటిందని కవి పోతన అన్నారు. పైగా, అసంతృప్తిపై ఆయన ఒక పద్యం కూడా రాశారు. 
 
"వ్యాప్తిన్ చెందక వగవక ప్రాప్తించిన లేశమైన 
పదివేలనుచున్ తృప్తిన్ చెందని మనుజుడు
సప్తద్వీపములనైన చక్కన్ బడునే" 
 
ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను అడిగితే వందలో 99 శాతం మంది బాగున్నాం అని చెప్పరు. ఇంకా ఏదో కావాలి అని చూస్తూనే ఉంటారు. పైగా నసుగుతుంటారు. నాకేం బ్రహ్మాండంగా ఉన్నాం అనే మాట వారి నుంచి వినిపించదు. లక్షలాది రూపాయల జీతం తీసుకుంటున్నా వారిలో ఇంకా అసంతృప్తి దాగివుందని తెలుసుకోవచ్చు. అందుకే అసంతృప్తి ఓ మాయరోగంగా మన పెద్దలు పేర్కొంటారు. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

తల్లికి వందనం.. ఏ ఒక్క బిడ్డ విద్యకు దూరం కాకూడదు.. నారా లోకేష్

స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ స్కామ్ : నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

కేజీ బంగారాన్ని కొట్టేసిన సోదరులు.. జ్యువెలరీ షాపుకు కన్నం వేసి..?

ఛార్జింగ్ అవుతున్న ఫోన్ పేలడంతో 14 ఏళ్ల బాలుడి మృతి

జూలై 23, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

అన్నీ చూడండి

అబ్జెక్ష‌న్ మై లార్డ్‌కు అండగా మెగాస్టార్ చిరంజీవి

Jayasudha : సమ్మర్ హాలిడేస్.. లో అమ్మమ్మ సుశీలమ్మగా జయసుధ

Rahul Sipligunj : బైక్ రైడర్ సీటులో దారిచూపిన వ్యక్తి అంటూ ఆనందక్షణాలతో రాహుల్ సిప్లిగంజ్‌

Prashanth Neel : డ్రాగన్ కు ముందు భయపెట్టే చిత్రంగా ప్రశాంత్ నీల్ 418 చిత్రం సిద్ధమైంది

Allari Naresh :సురభి తో నా కంటి మీద కునుకే లేదంటున్న అల్లరి నరేష్

తర్వాతి కథనం
Show comments