శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 6 అక్టోబరు 2017 (13:15 IST)

శృంగారానికి ముందు ఓకే.. కానీ అతిగా స్వీట్స్ తీసుకుంటే...

అలసిపోయి ఇంటికొచ్చాక నచ్చిన స్వీట్‌ను అలా నోట్లో వేసుకుంటే స్టామినా పెరుగుతుంది. తద్వారా రోజంతా కోల్పోయిన శక్తిని తిరిగి పొందవచ్చు. అలాగే శృంగారానికి ముందు తీపి పదార్థాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు స

అలసిపోయి ఇంటికొచ్చాక నచ్చిన స్వీట్‌ను అలా నోట్లో వేసుకుంటే స్టామినా పెరుగుతుంది. తద్వారా రోజంతా కోల్పోయిన శక్తిని తిరిగి పొందవచ్చు. అలాగే శృంగారానికి ముందు తీపి పదార్థాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అలాగే శృంగారంలో పాల్గొనడానికి ముందు చాక్లెట్ తినడం వల్ల స్టామినా పెరుగుతుందట. అయితే తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే మాత్రం గుండెకు ముప్పు తప్పదని తాజా అధ్యయనంలో తేలింది. 
 
బ్రిట‌న్‌లోని స‌ర్రే యూనివ‌ర్సిటీలో ప‌రిశోధ‌నా బృందం చేపట్టిన అధ్యయనంలో స్వీట్ల‌లో గ్లూకోజ్ ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల అవి తిన్న వారి కాలేయంలో కొవ్వుస్థాయులు పెరగడం గమనించినట్లు పరిశోధకులు తెలిపారు. 
 
తద్వారా ఆ కొవ్వు పెరిగి హృదయంపై ప్రభావం చూపించినట్లుగా గుర్తించారు. అలాగే వారిలో జీవ‌క్రియ చ‌ర్య‌లు కూడా మంద‌గించిన‌ట్లు క‌నిపెట్టారు. ఇలా జీవ‌క్రియ చ‌ర్య‌లు మంద‌గించ‌డం వ‌ల్ల హృద్రోగాలు, ప‌క్ష‌వాతం వంటి జ‌బ్బులు తప్పవని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. స్వీట్స్ మాత్రమే గాకుండా తీపి పదార్థాలు కలిపిన జ్యూస్‌లు, క్యాండీలు, చాక్లెట్లు కూడా గుండెకు ముప్పు తెస్తాయని వారు చెప్తున్నారు.