సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By జె
Last Modified: సోమవారం, 11 మే 2020 (22:40 IST)

క్యాప్సికంలో ఏమున్నదో తెలుసా?

సాధారణంగా క్యాప్సికంను చూస్తే చాలామంది ఇష్టపడరు. పచ్చిమిరపకాయల్లో పెద్దది క్యాప్సికం. కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. వండి తింటే క్యాప్సికం టేస్టే వేరయా అనే వారు లేకపోలేదు. కానీ అలాంటి క్యాప్సికంను కడుపారా తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
 
డయాబెటిస్ వున్నవారు ప్రతిరోజూ దీన్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతున్నారు. క్యాప్సికంలో ఉండే అల్ఫాగ్లూకోజైడేజ్, లైపేజ్ అనే ఎంజైమ్‌లు, కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్‌గా మారే ప్రక్రియను నెమ్మదింపజేస్తాయట. 
 
దీనివల్ల కార్బోహైడ్రేట్లు తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా ఉంటాయట. అంతేకాకుండా క్యాప్సికంలోని యాంటీ ఆక్సీడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయట. మానసిక ప్రశాంతతను అందస్తాయట. క్యాప్సికం శరీరంలోని క్రొవ్వును కరిగించే గుణం కూడా ఉందట.