వంటనూనెను ఇలా వాడితే చాలా మంచిది.. లేకుంటే గోవిందా!?

శనివారం, 2 ఏప్రియల్ 2022 (22:28 IST)
వంటనూనెను ఇలా వాడితే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకసారి వాడిన నూనెను మరో సారి వాడేముందు పాత్రలో అడుగున ఉన్న ఆయిల్‌ను వదిలేస్తే మంచిది. లేదంటే వడగట్టుకుని వాడాలి. వంట నూనెపై సూర్యరశ్మి పడకుండా చూడాలి. నేరుగా ఎండ పడటం వల్ల నూనెలో కొన్ని రసాయనిక మార్పులు జరిగే అవకాశం ఉంది..
 
వేపుళ్ళకి వాడిన నూనెను మళ్లీ వేయించటానికి ఉపయోగించకూడదు. ఇలా చేస్తే శరీరంలోకి ట్యాక్సిన్స్ చేరే ప్రమాదం ఉంది. వంట నూనె కొనేముందు అందులో వున్న కొవ్వు శాతం చూసి మరీ కొనాలి. వంటకు వాడే నూనెలో 8 నుంచి 10 శాతం శ్యాచురేటెడ్ కొవ్వు ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
 
ఎల్లప్పుడూ ఒకే నూనె కాకుండా కాంబినేషన్ ఆయిల్స్ ను వాడితె మంచిది. సన్ ఫ్లవర్, రైస్ బ్రాన్ , నువ్వులు, వేరుశెనగ , కొబ్బరి నూనెల్లో ఉండే మోనో శ్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్ శ్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి చాలా అవసరం.  
 
వంటలు వండేటప్పుడు నూనె వాడకం తగ్గించాలి. దీని వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరిగినట్టు అవుతుంది. నూనెను కొలత ప్రకారం వాడుకోవటం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

అన్నీ చూడండి

జూలై 15, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

Nara Lokesh: ప్రత్యేక సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ఏపీ సర్కారు రెడీ

ఏపీలో 10 రోజులు సర్ గడువు పొడిగింపు... ఎన్నికల సంఘం

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇకలేరు

రోడ్డు ప్రమాదాలు కామనే.. 18 ఏళ్ల యువకుడిపై కేసు పెడతారా?: వైఎస్ జగన్

అన్నీ చూడండి

Thiruveer: నేను కంఫర్టబుల్ గా ఉన్నా, నాటకాలు కంటే సినిమా చాలా పెద్ద బాధ్యత : హీరో తిరువీర్

'సత్లుజ్' మూవీ నిర్మాణ సంస్థపై కేంద్రం కన్నెర్ర.. ఎందుకో తెలుసా?

Varma: అన్వేషణ లో దర్శకుడు వంశీ నాకంటే బాగా సీన్స్ తీశారు : రామ్ గోపాల్ వర్మ

వెంకటేశ్వర స్వామి స్తోత్రాలను వెస్ట్రన్ స్టైల్‌లో విని ఆశ్చర్యపోయా : జి. నాగేశ్వర్ రెడ్డి

Rohit Saraf: ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి షూటింగ్ పూర్తి చేసిన రోహిత్ సరాఫ్

తర్వాతి కథనం
Show comments