ganesh chaturthi

కరోనావైరస్ అధికంగా వుండే డేంజరస్ స్పాట్లు...

Written By సిహెచ్
Updated: గురువారం, 22 అక్టోబరు 2020 (22:24 IST)
కరోనావైరస్. ఈ మాట వింటే ఇప్పుడు వణుకే. ఎందుకంటే కంటికి కనిపించని ఈ వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఈ వైరస్ అడ్డుకునేందుకు మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం ప్రధానమైనవి. ఇకపోతే ఈ వైరస్ ఎక్కడెక్కడ అధికంగా తిష్టవేసుకుని వుంటుందో చూద్దాం. 
 
కరెన్సీ నోట్లు: కరెన్సీ నోట్లపై కరోనావైరస్ ఎక్కువకాలం అలాగే వుంటుందని చెపుతున్నారు. కాబట్టి షాపులకు వెళ్లినప్పుడు కరెన్సీ నోట్లు చిల్లరి తిరిగి ఇచ్చినప్పుడు వాటిని ప్రత్యేకంగా ఓ బ్యాగులో పెట్టుకోవాలి. వాటిని శానిటైజ్ చేసే అవకాశం తక్కువ కనుక ఇంటి బయటే ఏదో ఒక మూల చూసుకుని అక్కడే పెట్టేయడం మంచిది. వాటిని మళ్లీ తీయాల్సి వచ్చినప్పుడు తప్పకుండా మాస్కు ధరించడం, వాటిని పట్టుకున్న తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం చేయాల్సిందే.
 
ప్రజా రవాణా- ఇంట్లో కిటికీలు
ప్రజా రవాణా షురూ అయ్యింది. కోవిడ్ నిబంధనలు సడలించడంతో ప్రతి ఒక్కరూ ప్రయాణిస్తున్నారు. వీరిలో కోవిడ్ ఎవరికి వుందో తెలుసుకోవడం కష్టం. కనుక ఒక్క రోగి కనుక బస్సులో ప్రయాణిస్తే అతడు బస్సులోని ఆయా ప్రాంతాలను తాకే అవకాశం వుంది కనుక అక్కడ వైరస్ తిష్ట వేసుకుని వుంటుంది.
 
ఏటీఎం సెంటర్లలో తస్మాత్ జాగ్రత్త
ఏటిఎం సెంటర్లకు వెళ్లినప్పుడు డబ్బు విత్ డ్రా చేసేందుకు బటన్స్ నొక్కుతారు. వాటి మీద కూడా వైరస్ అధికంగా వుండే ఛాన్స్ ఎక్కువ. కనుక కార్డ్ స్వైప్ చేసిన తర్వాత శానిటైజ్ చేసుకోవడం, డబ్బు డ్రా చేసాక చేతులు శుభ్రం చేసుకునేవరకూ ముఖంపై పెట్టుకోకుండా వుండటం చేయాలి. ఇంకా సెల్ ఫోన్ స్క్రీన్ పైన కూడా వైరస్ తిష్టవేసుకునే చాన్స్ ఎక్కువ. అలాగే ఇంటి కిటికీలు, గుమ్మాలపై కూడా వైరస్ ఎక్కువరోజులు వుంటుందని చెపుతున్నారు కనుక వాటిని కూడా శానిటైజ్ చేస్కుంటూ వుండాలి.

అన్నీ చూడండి

ఏయ్ దూరం పాటించు అని చెప్పిన మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టాడు, వీడియో

మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్‌ను పట్టిస్తే 70 లక్షల పాక్ రూపాయలు

మహిళతో వివాహేతర సంబంధం - రూ.29 కోట్ల నిధుల దుర్వినియోగం - అరెస్టు

ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ తొలి పూజ... సీఎం చంద్రబాబు నివాసంలో చవితి వేడుకలు

మద్యం మత్తులో మహిళా బైకరును వేధించిన అకతాయిలు..

అన్నీ చూడండి

మాతృత్వంలోకి అడుగుపెడుతున్న తరుణంలో శ్రీకల్పం వేడుకను పాటించిన సమంత

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

తర్వాతి కథనం
Show comments