Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తపోటుతో బాధపడేవారు ఆవకాయ పచ్చళ్లు తినొచ్చా?

Updated: ఆదివారం, 31 మార్చి 2019 (11:46 IST)
ఇటీవలి కాలంలో అనేక మంది బీపీ (రక్తపోటు), మధుమేహం (చక్కెర వ్యాధి) వంటి వ్యాధుల బారినపడుతున్నారు. బీపీ, డయాబెటీస్‌లతో బాధపడేవారు ఉప్పుకారం, చక్కెరలకు దూరంగా ఉంటారు. అయితే, ప్రతి ఒక్కరికీ ఊరగాయ, ఆవకాయ పచ్చళ్లు అంటే అమితమైన ఇష్టం. వీటిని లొట్టలేసుకున ఆరగిస్తుంటారు. 
 
సీజన్లలో దొరికే కాయలు నిలువ చేసుకొని అన్‌సీజన్‌లో వాటి రుచిని ఎంజాయ్‌ చేస్తుంటారు. భోజనంలో ఒక ముక్క ఊరగాయ ఉంటే చాలు, మొత్తం భోజనం లాగించేస్తారు. మరి ఇంత రుచిని ఇచ్చే ఊరగగాయ ఎంత తీసుకోవచ్చు? ఎవరైనా సరే పచ్చళ్లు మితంగానే తీసుకోవాలి. పచ్చళ్లలో ఉప్పు శాతం అధికం కాబట్టి బీపీ ఉన్నవారు వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. బీపీ ఉన్నవారు రోటీ పచ్చళ్లు తీసుకోవచ్చు. అయితే వీటిలో కూడా ఉప్పు తగ్గించి తీసుకోవాలి.
 
ఇక ఊరగాయల పోషక విలువల సంగతికి వస్తే, నిల్వ పదార్థం కాబట్టి వీటిలో గుడ్‌ బ్యాక్టీరియా ఉంటుంది. జీర్ణశక్తికి ఉపయోగపడుతుంది. మామిడికాయల్లో విటమిన్‌ ఎ అధికంగా ఉంటుంది. అలాగే విటమిన్‌ సి కూడా. ఆవకాయలో ఉండే నువ్వుల నూనె, ఆవాలు కూడా ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ఖనిజ లవణాలు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి ఉపయోగపడే కొవ్వు పదార్థాలు కూడా వీటి నుంచి లభిస్తాయి. 

అన్నీ చూడండి

పవన్ కల్యాణ్ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తూ షాక్ తగిలి మృతి చెందిన అభిమాని ఫ్యామిలీకి రూ. 5 లక్షల సాయం

ఉజ్జయిని శ్మశానంలో లేడీ అఘోరి అరాచకాలు, అరెస్ట్ చేసిన పోలీసులు

క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీతో అంబులెన్స్ సేవలు

ఫెడరల్ బ్యాంక్ గన్నర్స్ సోల్జరథాన్ హైదరాబాద్‌ను నిర్వహిస్తోన్న ఫిటిస్తాన్

Melbourne Street: మెల్‌బోర్న్ స్ట్రీట్‌లో దీపం పెట్టిన మహిళ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

దర్శకుడు సాయి రాజేష్ ఆవిష్కరించిన డియర్ హార్ట్ మోషన్ పోస్టర్

రూ.200 కోట్ల క్లబ్‌లో రవితేజ 'ఇరుముడి' చిత్రం

ఆది సాయికుమార్ క్లాప్ తో ప్రారంభమైన ఇ.ఎం.ఐ. చిత్రం

ఇరుముడి లాంటి విజయం దశాబ్దానికి ఒకసారి వస్తుంది : నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్

Sumanth Prabhas :మన ఫ్యాన్ బాయ్ అనే ప్రేమ ప్రభాస్‌లో కనిపించింది : సుమంత్ ప్రభాస్

తర్వాతి కథనం
Show comments