గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 18 మార్చి 2019 (14:28 IST)

ప్రతిరోజూ బీట్‌రూట్ జ్యూస్ తాగితే..?

నేటి తరుణంలో చిన్నవారి నుండి పెద్దల వరకు అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి నుండి ఉపశమనం పొందాలంటే.. డైట్‌లో కింద తెలిపిన జ్యూసెస్ తాగితే మంచి ఫలితాలు పొందవచ్చును. అలానే హైబీపీని నియంత్రించడంలో ఈ జ్యూస్‌లు బాగా ఉపకరిస్తాయి. 
 
బీట్‌రూట్ జ్యూస్:
ఈ జ్యూస్ రక్తపోటును తగ్గించడంలో ఎంతగానో పనిచేస్తుంది. రోజూ ఓ గ్లాస్ బీట్‌రూట్ జ్యూస్ తాగడం వలన రక్తపోటు వ్యాధి నియంత్రణలో ఉంటుంది. బీట్‌రూట్‌లో సహజసిద్ధంగా లభించే నైట్రేట్ ఉంటుంది. ఇది రక్తనాళాలను రిలాక్స్ చేస్తుంది. హైబీపీని అదుపులో ఉంచుతుంది. 
 
కాన్‌బెర్రీ జ్యూస్:
రక్తనాళాల డ్యామేజ్‌ను అరికట్టడంలో ఈ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ రక్తనాళాల్లో రక్తసరఫరాను పెంచడంలో సహాయపడుతాయి. ప్రతిరోజూ రెండు కప్పుల కాన్‌బెర్రీజ్యూస్ తీసుకోవడం వలన రక్తపోటు రిస్క్ దరిచేరకుండా ఉంటుంది. ఈ జ్యూస్‌లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి హైబీపీని నియంత్రణలో ఉంచుతాయి. 
 
దానిమ్మ జ్యూస్:
శరీరంలో ఏసీఈ ప్రభావం ఎక్కువగా ఉంటే రక్తనాళాలపై అధిక ఒత్తిడిపడి రక్తపోటు పెరుగుతుంది. అయితే దానిమ్మ జ్యూస్ తీసుకోవడం వలన ఆ ఎంజైమ్స్ విడుదల నిరోధింపబడుతుంది. దానిమ్మ జ్యూస్‌లో సహజసిద్ధమైన ఏసీఈ పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో ఎంతో దోహదపడుతాయి. అలానే రక్తనాళాలను రిలాక్స్ చేస్తాయి.