గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : బుధవారం, 27 మార్చి 2019 (16:45 IST)

అరటి పండులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..?

అరటి పండు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ అరటి పండు మీద నల్ల మచ్చలు కనిపిస్తే పారేస్తుంటారు. పండిపోవడం వలన వచ్చిన నల్ల మచ్చలు చూసి దీనిలో పోషక విలువలు పోయాయని అనుకుంటారు. కానీ పండిన అరటి పండులో కూడా పోషక విలువలు చాలా ఉన్నాయి.


అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అరటి పండులో పొటాషియం, మాంగనీస్, ఫైబర్, రాగి, విటమిన్ సి, విటమిన్ B6 మరియు బయోటిన్ సమృద్ధిగా ఉంటాయి. ఆస్తమా, క్యాన్సర్, అధిక రక్తపోటు, మధుమేహం, అజీర్తి, అలాగే జీర్ణ సమస్యలను నిరోధించడానికి సహాయపడతాయి. 
 
మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే పండిన అరటి పండులోని పోషకాలు మామూలు పండులో ఉన్నంత పరిమాణంలో ఉండవు. అరటి పండులో ఉండే సంక్లిష్ట పిండి పదార్థాలు పక్వానికి వచ్చే కొలదీ, స్టార్చ్ నుండి సాధారణ చక్కెరలవలే మార్పులకు గురవుతుంది.

ఏదిఏమైనా క్యాలరీల సంఖ్య మాత్రం అదేవిధంగా ఉంటుంది. కానీ నీటిలో కరిగే స్వభావం ఉండే విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ మరియు థయామిన్ వంటి విటమిన్లు తగ్గుదలకు గురవుతాయి. అరటి పండులో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్న కారణాన, కణ నష్టాన్ని నిరోధిస్తుంది. అరటి పండ్లలో ఉండే పొటాషియం నిల్వలు, రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. 
 
మాగిన అరటి పండ్లను తరచుగా తీసుకోవడం వలన రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. హార్ట్ అటాక్ సమస్యలు రాకుండా ఉంటాయి. అరటి పండు పక్వానికి వస్తే యాంటాసిడ్ వలే పనిచేస్తుంది. గుండె మంటను నివారిస్తుంది. ఐరన్ అధికంగా ఉండటం వల్ల శరీరంలో రక్త స్థాయిలు పెరిగి అనీమియా నుండి బయటపడవచ్చు.

బాగా పండిన రెండు అరటి పండ్లను తినడం వలన 90 నిమిషాల పాటు లాంగ్ వర్కౌట్ చేయగలిగినంత శక్తి స్థాయిలు శరీరానికి లభిస్తాయని చెప్పబడుతుంది. నీరసంగా ఉన్నవారికి ఇది ఉపయోగపడుతుంది. 
 
అరటి పండుకి క్యాన్సర్ మరియు శరీరంలో పేర్కొన్న అసంబద్ద కణాలను చంపే సామర్ధ్యం ఉంది. అల్సర్స్‌ను తగ్గించడంలో కూడా అరటి పండు ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీనిలో ఫైబర్ అధికంగా ఉన్నందున మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు. అరటి పండు తింటే డిప్రెషన్ నుండి బయటపడి మంచి మానసిక స్థితి పొందే అవకాశం కూడా ఉంది.