శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : శుక్రవారం, 29 నవంబరు 2019 (20:50 IST)

తీపి పదార్థాలను భోజనానికి ముందు తీసుకుంటున్నారా?

స్వీట్స్‌ను ఆహారానికి ముందు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. ఆహారం తీసుకున్న తర్వాత చివరిగా స్వీట్స్ తీసుకోకూడదని వారంటున్నారు. ఆహారం తీసుకునేందుకు ముందుగా ఆకలి కారణంగా పొట్టలో గ్యాస్ అధికంగా వ్యాపిస్తుంది. అలాంటి సమయంలో స్వీట్స్ తీసుకోవడం ద్వారా ఆ గ్యాస్ ప్రభావం మెల్లగా తగ్గిపోతుంది. 
 
ముఖ్యంగా పండ్లు తీసుకోవడానికి ముందు స్వీట్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆహారం జీర్ణమైన తర్వాత పొట్టలో నిల్వ ఉండే వ్యర్థాలతో ఏర్పడే వ్యాధుల సంఖ్య అధికమైపోతున్నాయని, స్వీట్స్‌ను తీసుకోవడం ద్వారా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్‌ను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.  
 
నీరు ఎలా తాగాలి?
ఆహారం తీసుకునేందుకు ముందు నీళ్లు సేవించడం కొందరి అలవాటు. మరికొందరైతే పూర్తి ఆహారం తీసుకున్నాక సేవిస్తారు. అయితే ఆహారం తీసుకుంటుండగా మధ్య మధ్యలో కాసింత నీరు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.  
 
ఆహారం తీసుకున్న వెంటనే నిద్రపోవచ్చా?
ఆహారం తీసుకున్న వెంటనే హాయిగా నిద్రొచ్చేస్తుంది. అయితే ఆహారం తీసుకున్న వెంటనే నిద్రపోకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంకా రాత్రి పూట నిద్రించేందుకు 2 గంటల ముందే ఆహారం తీసుకోవడం మంచిది. తద్వారా అజీర్ణ సమస్యలను దూరం చేసుకోవచ్చు.