మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 నవంబరు 2019 (10:29 IST)

అన్నం తిన్నవెంటనే పండ్లు ఆరగించే అలవాటువుందా?

మ‌న‌లో చాలా మంది భోజ‌నం చేసిన వెంట‌నే అధికంగా నీరు తాగుతుంటారు. ఇక కొంద‌రు స్మోకింగ్ చేస్తారు. మ‌రికొంద‌రు శీత‌ల పానీయాలు, పండ్ల ర‌సాలు తాగుతుంటారు. అయితే నిజానికి మ‌నం భోజ‌నం చేశాక చేయ‌కూడ‌ని ప‌నులు కొన్ని ఉన్నాయి. అవేమిటో, వాటి వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. 
 
* చాలా మంది భోజనం చేసిన వెంటనే రకరకాల పండ్లను తీసుకుంటారు. అలా చేయరాదు. ఎందుకంటే మనం తిన్నఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా గ్రహించలంటే పండ్లను తినరాదు. ఒక వేళ పండ్లను తినాలంటే భోజనం చేశాక కనీసం ఒక గంట వ్యవధి ఉండేలా చూసుకోవాలి. 
 
* భోజ‌నం చేశాక గ్రీన్ టీ తాగరాదు. తాగితే శరీరం మ‌నం తిన్న ఆహారంలో ఉండే ఐరన్‌ను సరిగ్గా గ్రహించలేదు. క‌నుక భోజ‌నం చేశాక గ్రీన్ టీ అస్సలు తాగరాదు. 
 
* భోజ‌నం చేసిన వెంట‌నే స్నానం చేయ‌రాదు. అలా చేస్తే జీర్ణ ప్ర‌క్రియ‌కు ఆటంకం క‌లుగుతుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాదు. దీంతోపాటు గ్యాస్‌, అసిడిటీ వ‌స్తాయి. అయితే భోజ‌నం చేశాక స్నానం చేద్దామ‌నుకుంటే క‌నీసం నలభై నిమిషాల అయినా ఆగితే మంచిది.
 
* భోజనం చేశాక ఎట్టి పరిస్థితిలోనూ స్మోకింగ్ చేయరాదు. ఒక వేళ చేస్తే పొగాకులో ఉండే నికొటిన్ మన శరీరంలో జరిగే జీర్ణ క్రియను అడ్డుకుంటుంది. అలాగే శరీరం కేన్సర్ కణాలను గ్రహించి కేన్సర్ వచ్చేలా చేస్తుంది. కనుక భోజ‌నం చేశాక పొగ తాగ‌కూడ‌దు. 
 
* భోజనం చేసిన వెంట‌నే వ్యాయామం చేయ‌రాదు. టీ, కాఫీలు తాగ‌రాదు. అలాగే ఎక్కువ సేపు కూర్చోరాదు. భోజనం చేసిన తర్వా కొంత సేపు అటు, ఇటు న‌డ‌వాలి. అలాగే తిన్న వెంట‌నే నిద్రించ‌రాదు, గ్యాస్ వ‌స్తుంది. అధికంగా బ‌రువు పెరుగుతారు.