శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 28 సెప్టెంబరు 2017 (17:08 IST)

మిరియాలతో బరువు తగ్గండిలా...

అధిక బరువుతో అనారోగ్య సమస్యలు తప్పవు. ఒబిసిటీ డయాబెటిస్‌కు కారణమవుతుంది. అందుకే మిరియాలతో బరువు సులభంగా తగ్గవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మిరియాలు జీర్ణశక్తిని పెంచుతాయి. కొవ్వు పదార్థాలను సులభం జ

అధిక బరువుతో అనారోగ్య సమస్యలు తప్పవు. ఒబిసిటీ డయాబెటిస్‌కు కారణమవుతుంది. అందుకే మిరియాలతో బరువు సులభంగా తగ్గవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మిరియాలు జీర్ణశక్తిని పెంచుతాయి. కొవ్వు పదార్థాలను సులభం జీర్ణమయ్యేలా చేస్తాయి. తద్వారా శరీరంలో ఉన్న కొవ్వు కరగడమే కాకుండా మలినాలు అన్నీ బయటికి పోతాయి.
 
మిరియాల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ వైరస్ బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని శరీర రోగ నిరోధక వ్యవస్థకు చేకూర్చటమేకాకుండా, జీవక్రియ సజావుగా సాగేలా చేస్తుంది. ఆరోగ్యకరమైన రోగ నిరోధక వ్యవస్థ, జీవక్రియలు శరీరంలో కొవ్వు పదార్థాల నిల్వలను ఇది నివారించి.. బరువు తగ్గేందుకు తోడ్పడతాయి. 
 
చేపల తరహాలోనే మిరియాలతో చేసిన వంటకాలతో ఒమేగా-3 ఫాటీ ఆసిడ్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో మంచి కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచి, గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. రోజువారీ ఆహారంలో నల్ల మిరియాలను చేరిస్తే చర్మం, జుట్టు మెరుగుదలకు సహాయపడుతుంది.