శుక్రవారం, 1 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : గురువారం, 29 సెప్టెంబరు 2016 (17:11 IST)

పుదీనా చట్నీ, ఉల్లి, వెల్లుల్లితో జీర్ణశక్తి.. వర్షాకాలంలో ఆహార జాగ్రత్తలు

వర్షాకాలం వచ్చేస్తోంది. వర్షాకాలం మహిళలు తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలని న్యూట్రీషన్లు చెబుతున్నారు. వర్షాకాలంలో అజీర్ణవ్యాధి కలిగేటంత ఆహారం తీసుకోకూడదు. ఆకుకూరలు, వర్షాకాలంతో తినకపోతే మంచిది.

వర్షాకాలం వచ్చేస్తోంది. వర్షాకాలం మహిళలు తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలని న్యూట్రీషన్లు చెబుతున్నారు. వర్షాకాలంలో అజీర్ణవ్యాధి కలిగేటంత ఆహారం తీసుకోకూడదు. ఆకుకూరలు, వర్షాకాలంతో తినకపోతే మంచిది. కాయలు పులుసు సాంబార్, చట్నీలను తరుచూ తీసుకోవాలి. 
 
ఆకుకూరలలో నీరు అధికంగా ఉండటం వల్ల జీర్ణశక్తి తగ్గుతుంది. వర్షాకాలంలో ఆకుకూరలపై క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయి. అందుచేత వీలైనంత వరకు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం తగ్గించండి. 
 
ఇక పుదీనా చట్నీ, ఉల్లి, వెల్లుల్లితో చేసిన పదార్థాలు వాడితే జీర్ణశక్తి పెరుగుతుంది. ఇవి రక్తాన్ని శుద్ధిపరుస్తాయి కూడా. వీటిని తీసుకోవడం ద్వారా ఆకలి పెరుగుతోంది. 
 
అలాగే పులుపు పదార్థాలు పెరుగు, మజ్జిగలాంటివి పూర్తిగా తగ్గించాలి. ఇవి కడుపులో ఆమ్ల మోతాదును పెంచుతాయి. వేడిచేసి చల్లార్చిన నీరుతాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు.