శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2017 (10:23 IST)

అరటి ఆకులో భోజనం పెట్టడానికి కారణమేంటి?

అరటి ఆకులో భోజనం చేయడం అనేది మనకి అనాదిగా ఉన్నఆచారం. మనం అన్ని ఆకులుండగా అరటి ఆకుని మాత్రమే ఎంచుకోడానికి అనేక కారణాలు ఉన్నాయి. పచ్చగా ఉండే అరటి ఆకులో ఆహారం పెట్టుకుని తినడం వల్ల త్వరగా జీర్ణమవుతుంది.

అరటి ఆకులో భోజనం చేయడం అనేది మనకి అనాదిగా ఉన్నఆచారం. మనం అన్ని ఆకులుండగా అరటి ఆకుని మాత్రమే ఎంచుకోడానికి అనేక కారణాలు ఉన్నాయి. పచ్చగా ఉండే అరటి ఆకులో ఆహారం పెట్టుకుని తినడం వల్ల త్వరగా జీర్ణమవుతుంది. 
 
ఒకవేళ అన్నంలో విషం కలిపితే ఆకు నలుపు రంగుగా మారిపోతుంది. వేడి అన్నం వడ్డిస్తే ఆకులోని అనేక రకాల పోషకాలు ఈ అరటి ఆకులో ఉన్నందున మంచి రుచిని కలిగిస్తాయి. పర్యావరణానికి విఘాతం కలుగకుండా తేలికగా మట్టిలో కలిసిపోతాయి. అందుకే ఇంటికి వచ్చిన అతిథుల మనసులో అనుమానం రాకూడదనే ఉద్దేశ్యంతోనే అరిటాకులో భోజనం పెడతారు. 
 
* అరటి ఆకులో విస్తరి ఆకులో భోజనం చేయడం వల్ల ఆకలి పెరుగుతుంది, ఆరోగ్యవంతులుగా ఉంటారు.
* తామరాకులో భోజనం చేయడo వలన ఐశ్వర్యం కలిగి సాక్షాత్ లక్ష్మీ దేవి కటాక్షం కలుగుతుంది.
* బాదం ఆకులో భోజనం చేయడంవలన కఠిన హృదయులవుతారు.
* టేకు ఆకులో భోజనం చేయడం వలన భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగలిగే జ్ఞానం వస్తుంది.