ఆదివారం, 12 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : శనివారం, 7 అక్టోబరు 2017 (13:37 IST)

అతిగా కూర్చున్నారో అంతే సంగతులు.. ఐదు నిమిషాలైనా లేచి?

కార్యాలయాల్లో, ఇళ్ళల్లో ఎక్కువ గంటలు కూర్చునే వారి సంఖ్య పెరిగిపోతోంది. తద్వారా క్యాన్సర్ ముప్పు వుందని ఇప్పటికే అధ్యయనాలు తేల్చాయి. రెండు గంటలకంటే ఎక్కువ సమయం కూర్చొని ఉంటే 8 శాతం కోలోన్ క్యాన్సర్, 1

కార్యాలయాల్లో, ఇళ్ళల్లో ఎక్కువ గంటలు కూర్చునే వారి సంఖ్య పెరిగిపోతోంది. తద్వారా క్యాన్సర్ ముప్పు వుందని ఇప్పటికే అధ్యయనాలు తేల్చాయి. రెండు గంటలకంటే ఎక్కువ సమయం కూర్చొని ఉంటే 8 శాతం కోలోన్ క్యాన్సర్, 10 శాతం ఎండోమెట్రియల్ క్యాన్సర్, 6శాతం లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. గంటల సేపు కూర్చోవడం.. టీవీలు చూస్తూ జంక్‌ఫుడ్స్ లాగించేయడం ప్రమాదానికి దారితీస్తాయని వైద్యులు అంటున్నారు. 
 
అతిగా కూర్చోవడం అనారోగ్య సమస్యలను కొనితెచ్చి పెడుతుంది. అందుకే కనీసం గంటకోసారైనా ఐదు నిమిషాలపాటు లేచి కాస్త అటూఇటూ నడవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కనీసం పదినిమిషాలపాటు నడిచేందుకు ప్రయత్నించండి. ముఖ్యంగా ఫోను మాట్లాడేటప్పుడు నిల్చునో, నడుస్తూనో మాట్లాడండి. 
 
వీలైనంత వరకు నిల్చుని పనిచేసేందుకు అలవాటు పడండి. టీవీలో రెండున్నరగంటలసేపు సినిమా చూస్తుంటే కనీసం ఓ అర్ధగంటైనా నిల్చోవడానికి ప్రయత్నించండి. ఇవన్నీ చేస్తే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.