సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By chj
Last Modified: శనివారం, 7 అక్టోబరు 2017 (22:16 IST)

వనమూలికలతో యవ్వనంగా వుంటారా?

వయస్సుతో వచ్చే మార్పలును నిలువరించడం సాధ్యమా? అందుకు ఎలాంటి మందులు వాడాలి? దృఢంగా, యవ్వనంతో కనిపించాలంటే ఏం చెయ్యాలి. ఐతే ఇది చదవండి... మనిషి వయస్సుతో ఎప్పటి నుంచో పోరాడుతూనే ఉన్నాడు. భూమిపై చిరస్థాయిగా నిలిచిపోవాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అందుకో

వయస్సుతో వచ్చే మార్పలును నిలువరించడం సాధ్యమా? అందుకు ఎలాంటి మందులు వాడాలి? దృఢంగా, యవ్వనంతో కనిపించాలంటే ఏం చెయ్యాలి. ఐతే ఇది చదవండి... మనిషి వయస్సుతో ఎప్పటి నుంచో పోరాడుతూనే ఉన్నాడు. భూమిపై చిరస్థాయిగా నిలిచిపోవాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అందుకోసం అనాదిగా పరిశోధనలు జరుపుతూనే ఉన్నాడు. ప్రకృతిలో ఒనగూరిన ఎన్నో మందు మొక్కలు కొన్ని సత్ఫలితానుల ఇస్తున్నాయి. ఒకవైపు వాతావరణ కాలుష్యం మనిషిని పట్టి పీడిస్తోంది. 
 
ఇలాంటి తరుణంలో రసాయనాలు కలిపిన మందులు వాడకం మరింత ప్రమాదకరం. ఖరీదైన వైద్యంగా మారింది. మందు మొక్కలు తక్కువ ఖర్చుతో ఎక్కవ ఫలితాలనిస్తున్నాయి. పై ఇతర ప్రభావాలుండవు. జుజుబీ, అశ్వగంధి, రియోడియోలా రోసియా, రోకా వంటి మొక్కలు వయసుతో వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి ఉపకరిస్తున్నాయి.
 
వయస్సు మీద పడుతోందంటనే ఆందోళన మొదలవుతుంది. దానితోపాటు నిద్ర లేమి మామూలై పోతాయి. జుజుబీ పండు ఇచ్చే ఫలితాలు ఆశ్చర్యం కలిస్తుంది. వయస్సుతో వచ్చే మార్పులను నిలువరించడంతో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మనిషిలోని వయస్సుతో వచ్చే నిద్రలేమిని పోగొడుతుంది. ఆందోళనను తగ్గిస్తుంది. కాలేయాన్ని పని తీరును పెంపొందించడానికి ఉపకరిస్తుంది.
 
అశ్వగంధి అనే మొక్క ప్రకృతి ప్రసాధించిన వైద్య మొక్క. వయస్సును కప్పి పెట్టడానికి అవస్థలు పడేవారికి వరప్రసాదిని. సహజంగానే దీనికి మనిషిని యవ్వనంగా ఉంచే లక్షణాలు ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుతాయి. మానసిక ఒత్తిడిని నియంత్రించే వ్యవస్థకు ఇతోధికంగా దోహద పడుతాయి. మనిషిలోని ఆందోళన, ఆత్రుత, మానసిక వైరాగ్యాలను తగ్గిస్తుంది. అక్షనాళము, డెనడ్రాన్లను పెంపొందించి ఆరోగ్యానికి మేలు చేకూర్చుతుంది. 
 
రోహాలియా రోసియా(గులాబీ) ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. మనిషిని మరింత ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఇందులోని ఔషధ గుణాలు దివ్యంగా ఉంటాయి. ఒత్తిడి నుంచి వెసులుబాటు కలిగిస్తూ శరీరంలోని కణాలకు కొత్త శక్తిని ఇస్తాయి. ఈ మొక్క వ్యాధినిరోధకతను పెంచడంతోపాటు మానసిక స్థితిని మెరుగు పరుస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
 
గిన్సెంగ్‌ అనేది మంచి ఔషద మూలిక దీనిలో కూడా ఇదే విధంగా యవ్వనాన్ని పెంపొందించే లక్షణాలున్నాయని వృక్షశాస్త్రజ్ఞలు కనుగొన్నారు. మూలిక తీసుకున్న వారిలో ఉద్వేగం పెరగడంతో పాటు శారీరక దృఢత్వం పెరుగుతుంది. ఇంతేనా మానసిక ఒత్తిడిని తగ్గించడం, రక్త ప్రసరణను పెంచడం, శరీరంలో కొలస్ట్రాల్‌ను నియంత్రించడానికి దోహదపడతుంది. 
 
మనిషికి కావాల్సిందేముంటుంది. ఇందులో ఉన్న పొటాషియం, కాల్షియం, లవణాలు ఆరోగ్య ఉపకారులుగా పని చేస్తాయి. ఎండబెట్టిన మూలికతో అనేక ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. జ్ఞాపక శక్తిని వృద్ధి చెందిస్తుంది. స్టెరాయిడ్‌ హార్మోనులను నియంత్రిస్తుంది. దీని వేరు వలన నరాలకు సంబంధించిన వ్యాధులను నయం చేయవచ్చు. ఇప్పటికే చాలా కంపెనీలు వీటిని మాత్రలు, ఫౌడర్ల రూపంలో మార్కెట్లోకి విడుదల చేశారు. అయితే తాజాగా వీటిని తయారు చేసుకోవడం వలన ఉపయోగకరంగా ఉంటుంది.