శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 2 జనవరి 2017 (12:48 IST)

ప్రతిరోజూ ఒక కప్పు ఆకుకూర తీసుకుంటే.. మధుమేహం మటాష్

ప్రతిరోజూ ఒక కప్పు ఆకుకూర తీసుకునే వారిలో మధుమేహం వచ్చే ప్రమాదం 14శాతం తగ్గించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. లేదంటే ఆకుకూరలు వారానికి మూడు సార్లు తీసుకుంటూ వుండాలని వారు సూచిస్తున్నారు. ఆకుకూరలు

ప్రతిరోజూ ఒక కప్పు ఆకుకూర తీసుకునే వారిలో మధుమేహం వచ్చే ప్రమాదం 14శాతం తగ్గించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. లేదంటే ఆకుకూరలు వారానికి మూడు సార్లు తీసుకుంటూ వుండాలని వారు సూచిస్తున్నారు. ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆకుకూరల్లోని విటమిన్‌-బీ పాలెట్స్‌ జ్ఞాపకశక్తి, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. 
 
వీటిల్లోని విటమిన్‌-ఏ కంటిచూపును మెరుగు పరుస్తుంది. గుండె సంబంధిత వ్యాధులకు దారితీసే అమైనో ఆమ్లాలనూ నియంత్రిస్తాయి. ముఖ్యంగా పొన్నగంటి కూరలో ఏ విటమిన్‌ అధికం. దీనిని తింటే రేచీకటి రాదు. శరీరానికి చలువ కూడా. పేగుల్లోకి వెళ్లిన వెంట్రుకలను సైతం కరిగించే శక్తి దీనికుంది. ఇక కూరల్లోగానీ, పచ్చడిగా గానీ పుదీనా తీసుకుంటే మెదడు చురుగ్గా ఉంటుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
 
ఇక బరువు తగ్గించడంలోనూ ఆకుకూరలు ఎంతగానో ఉపయోగ పడతాయి. ఆకుకూరల్లోని విటమిన్ కె బరువును తగ్గిస్తుంది. ఇక ఆకుకూరల్లో క్యాలరీలు, కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.