శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : శనివారం, 6 జులై 2019 (12:07 IST)

ఉసిరికాయ పొడిలో కొద్దిగా తేనె కలుపుకుని తింటే.. ఎంత మేలో తెలుసా?

అధిక బరువు, శరీరంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం వలన గుండె వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. హార్ట్ స్ట్రోక్, గుండెకు వాల్స్ బ్లాక్ కావడం వంటి ఇబ్బందులు యువకులకు కూడా రావడం సాధారణమైపోయింది.


ఈ రోజుల్లో అత్యధిక మరణాలు గుండె వ్యాధులతోనే ఉంటున్నాయి. గుండెకు సరిగ్గా రక్త సరఫరా లేకపోవడం, నరాల్లో కొవ్వు అడ్డంగా పేరుకుపోవడం వంటి వాటితో గుండెకు ముప్పు ముంచుకొస్తోంది. 
 
గుండె ఆరోగ్యం కాపాడుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించమని చెబుతున్నారు నిపుణులు. వెల్లుల్లిని జ్యూస్‌గా చేసుకుని ఓ గాజు సీసాలో ఉంచి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. రోజూ ఒక చెంచా చొప్పున పరగడపున నీటిలో కలుపుకుని తాగితే రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది. 
 
గుండె సమస్యలు ఉన్నవారు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉన్నవారు, పెద్ద వయసు వారు రోజూ ఆచరిస్తే లైఫ్ టైం పెరుగుతుంది. పొద్దున్నే 2, 3 పచ్చి వెల్లుల్లి రెబ్బల్ని తింటే గుండె, రక్త సరఫరాకు సంబంధించిన సమస్యలన్నీ దూరమైపోతాయి. 
 
ఉసిరికాయ పొడిలో కొద్దిగా తేనె లేదా పంచదార కలిపి నీటితో తీసుకుంటే కూడా ఫలితం ఉంటుంది. తులసి ఆకుల రసంలో తేనె, నీళ్లు కలుపుకుని తాగినా గుండె వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. రోజూ 4 తులసి ఆకులు నమిలి తిన్నా కూడా మంచిదే. రక్తంలో ఉండే చెడు కొవ్వును తగ్గించడంలో, గుండె జబ్బులు రాకుండా చూడడంలో తులసి ఆకులు బాగా పనిచేస్తాయి. తులసి ఆకులను మజ్జిగతో కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారు.