1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 23 అక్టోబరు 2015 (17:17 IST)

లావైపోతామని తిండి తగ్గిస్తున్నారా? తలనొప్పి తప్పందండోయ్!

అలవాటు పడిన ఆహారాన్ని మార్చినా.. తక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకున్నా.. భోజన విరామం పెరిగినా తలనొప్పి వచ్చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలసిపోవడం, మానసిక ప్రభావాల చేతనే తలనొప్పి వస్తుందని అనుకోవడం పొరపాటే. లావైపోతామని కార్పోహైడ్రేట్లు తగ్గించినా తలనొప్పి వస్తుందని వైద్యులు అంటున్నారు. 
 
మహిళలు ఒత్తిడిలో ఉన్నప్పుడు చాక్లెట్లు తినడం ద్వారా తలనొప్పి వస్తుంది. లావుగా ఉన్నామని తిండి తగ్గించినా హెడేక్ ఖాయం. పురుషులు బీరు తాగినా, విస్కీ, వైన్ తీసుకున్నా శరీరంలో టైరమైన్ పెరిగిపోయి, మెదడులో రక్త ప్రసారం నిదానించి తలనొప్పితో బాధపడాల్సి వస్తుంది. 
 
తాత్కాలికంగా మనసును ఆహ్లాదపరిచి, ఉత్సాన్నిచ్చే కాఫీకి దూరమైతే మైగ్రేన్ హెడేక్ వస్తుంది. శరీరంలో చక్కెర నిల్వలు తగ్గితే, దాని ప్రభావం మొదట తలనొప్పి రూపంలో బయటపడుతుందని. రోజుకు సరిపడా పంచదార తీసుకోని వారు కూడా తలనొప్పితో కష్టాలు పడక తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.