Festival Posters
✕

బార్లీ నీళ్లు తాగితే కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించగలదా?

Written By సిహెచ్
Updated: శుక్రవారం, 21 మే 2021 (22:46 IST)
బార్లీ విత్తనాలు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించగలవు. ఇవి శరీరం నుండి కొన్ని ఖనిజాలను (కాల్షియం, భాస్వరం వంటివి) తొలగించడంలో సహాయపడే మూత్ర ఉత్పత్తిని పెంచుతాయి. తద్వారా మూత్రవిసర్జన వల్ల మూత్రపిండాల రాళ్ళు ఏర్పడటం, పెరుగుదలను నివారిస్తాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడి వలన కలిగే నష్టం నుండి మూత్రపిండాలను రక్షిస్తుంది. దాని యాంటీఆక్సిడెంట్ ఆస్తి కారణంగా సాధారణ మూత్రపిండాల పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది.
 
బార్లీలో ఉండే బీటా-గ్లూకాన్ విసర్జన క్రియలో శరీరం నుండి విషపదార్ధాలను బయటకు నెట్టివేయడంలో సహాయపడుతుంది. ప్రేగుల్ని శుభ్రంగా ఉంచుతుంది. మసాలా పుడ్ తీసుకోవటం వలన కలిగే కడుపుమంటను ఈ పానీయం తగ్గిస్తుంది. బార్లి యాంటీ-ఇన్ప్లమేటరీ లక్షణం కలిగి ఉంది. కీళ్ల నొప్పులతో బాధ పడేవారు బార్లీనీటిని తాగటం వలన మంచి ఉపశమనం కలుగుతుంది.
 
షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు ఈ పానీయాన్ని ప్రతిరోజు తాగటం వలన వారి శరీరంలోని చక్కెరస్ధాయిలు కంట్రోల్‌లో ఉంచడంలో ఇది తోడ్పడుతుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజు ఒక గ్లాస్ ఈ పానీయాన్ని తాగటం వలన రోజువారి మన శరీరానికి అవసరమయ్యే పీచుపదార్ధం భర్తీ అవుతుంది. అంతేకాకుండా ఈ పానీయంలో ఉండే అధిక ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్ని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
 
బార్లీ రక్తపోటును తగ్గిస్తుంది. అందుకే గర్భిణీ స్త్రీలు రక్తపోటును అదుపులో ఉంచుకోవటానికి ప్రతిరోజు ఈ పానీయాన్ని సేవించటం చాలా ఉపయోగకరం. మూత్రపిండాలలో ఉన్న రాళ్లను బయటకు పంపించటంలో ఈ బార్లీ నీళ్లు ఎంతగానో సహాయపడతాయి. కనుక  ప్రతిరోజు ఒక గ్లాసు బార్లీ నీళ్లను తాగటం వలన మంచి ఫలితం ఉంటుంది.
 
అధికబరువును తగ్గించుకోవటంలో కూడా ఈ బార్లీ ఎంతగానో సహాయపడుతుంది. దీనిలో ఉండే ఫైబర్ చాలా సమయం వరకు పొట్టనిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియ రేటును మెరుగుపరుస్తుంది.

అన్నీ చూడండి

కిర్గిజ్‌స్థాన్‌లో అంతర్జాతీయ చెస్ ఛాంపియన్ షారన్ రాచెల్ అబీ అద్భుత ప్రదర్శన, రూ. 3 లక్షల ప్రోత్సాహక పురస్కారం

ఉప ముఖ్యమంత్రిని ఎంపవర్ స్టార్ అని అభివర్ణించిన ఉపాసన (video)

బీజేపీకి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గుడ్‌బై... నేడు తుది నిర్ణయం

రోడ్డు ప్రమాదాలను చూస్తే కన్నీళ్ళొస్తున్నాయి : కేంద్ర మంత్రి గడ్కరీ

వదినతో మరిది వివాహేతర సంబంధం, పెళ్లి వద్దన్నదని చంపేసాడు

అన్నీ చూడండి

డెహ్రాడూన్ ఐఎస్‌బిటి ఘటన స్ఫూర్తితో అన్‌ఎక్స్‌పెక్టెడ్ – సఫేద్ సచ్ చిత్రం ఫస్ట్ లుక్

Bellamkonda Sai: వరుస నేరాలు వెనుక భారీ కుట్ర ఛేధించే అధికారిగా టైసన్ నాయుడు

Sharwa: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామం కథ గా శర్వా భోగి విడుదల తేదీ మార్పు

సమంతకు మగబిడ్డ పుట్టడం, పేరు పెట్టడం అన్నీ జరిగిపోయాయ్

Naga Chaitanya: వృషకర్మ లో చిన్నారికి కళ్లుగా మారిన ట్రెజర్ హంటర్ అర్జున్ ఏం చేశాడు?

తర్వాతి కథనం
Show comments