మంగళవారం, 8 జులై 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 8 ఆగస్టు 2016 (12:50 IST)

కాఫీ మంచిదా..? ఆరెంజ్ జ్యూస్ మంచిదా..? ఏది తాగితే బెస్టో తెలుసుకోండి..!

కాఫీ తాగడం మంచిదా.. ఆరెంజ్ జ్యూస్ తాగడం మంచిదా? అనేది తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవండి. కాఫీని తీసుకోవడం ద్వారా మూడ్‌ను ప్రభావితం చేసుకోవచ్చు. కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ధాతువులకు ఇన్సుల

కాఫీ తాగడం మంచిదా.. ఆరెంజ్ జ్యూస్ తాగడం మంచిదా? అనేది తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవండి. కాఫీని తీసుకోవడం ద్వారా మూడ్‌ను ప్రభావితం చేసుకోవచ్చు. కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ధాతువులకు ఇన్సులిన్‌ సరఫరాలో సాయపడతాయి. అంతేగాకుండా గ్లూకోజ్ ప్రతి స్పందనను డికాఫినేటెడ్‌ కాఫీ తగ్గిస్తుందని ఇప్పటికే పరిశోధనల్లో వెల్లడైంది. 
 
మరోవైపు పళ్ళ రసాలలో చక్కెర పదార్థం అధికంగా ఉంటుంది. ఒకవేళ అందులో చక్కెర పదార్ధం ఎక్కువ లేకపోయినప్పటికీ పళ్ళ రసాలు తేలికగా జీర్ణమైపోతాయి. అందులో ఫైబర్‌ కూడా తక్కువే ఉంటుంది. దీనివల్ల బరువు పెరుగుతారు. అందుకే చక్కెర వ్యాధి ఉన్న వారిని పళ్ళ రసాలు తాగవద్దని అంటారు.

పాకేజ్డ్‌ పళ్ళ రసాలలో రంగులు, ప్రిజర్వేటివ్లు, రసాయనాలు ఉంటాయి. ఇవి మోతాదును మించివుంటే క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. పండ్ల రసాలను కాకుండా పండ్లను అలాగే తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అంతేగాకుండా కాఫీని తీసుకోవడం ద్వారా అందులోని చురుకైన కాంపౌండ్‌ మెథిల్‌పైరిడీనయం అనే పదార్థం కొలోన్‌ కాన్సర్‌ను నివారించే ఎంజైమ్‌లను ఉత్తేజితం చేస్తుందిట. 
 
ఆరెంజ్‌ జ్యూస్‌ కన్నా కాఫీలో అధికంగా కరిగిపోయి కలిసిపోయే ఫైబర్‌ ఉన్నందున ఆరోగ్యానికి కాఫీనే మంచిది. ఆధునిక కాలంలో అనేకమంది ఒక గ్లాసు ఆరెంజ్‌ జ్యూస్‌ తాగి రోజును ఆరోగ్యంగా ప్రారంభిస్తున్నామనుకుంటారు. కానీ వారికి తెలియంది ఏంటంటే ఒక గ్లాసు కోకాకోలాలో ఉండేంత చక్కెర పదార్థమే అందులోనూ ఉంటుందని. కరిగి, కలిసిపోయే ఫైబర్‌ ఎందుకు లాభదాయకమంటే అది కొలెస్ట్రాల్‌ ఏర్పడకుండా నివారించడమే కాకుండా ధమనులను వెడల్పు చేయడం ద్వారా హై బ్లడ్‌ ప్రెషర్‌ను తగ్గిస్తుంది.
 
కాఫీలో ఎల్‌డిఎల్‌ కొలెస్ట్రాల్‌ స్థాయిని ఉత్తేజితం చేసే కెఫెస్టాల్‌ అనే పదార్థం ఉంటుంది. కాఫీలో ఉండే నూనె పదార్థంలో ఈ కెఫెస్టాల్‌ ఉంటుంది. కాఫీని పేపర్‌ ఫిల్టర్‌ ద్వారా వడపోసినప్పుడు కెఫెస్టాల్‌ అందులోకి దిగదు. బాయిల్డ్‌ కాఫీ, ఫ్రెంచ్‌ ప్రెస్‌ కాఫీ, టర్కిష్‌ కాఫీలలో కెఫెస్టాల్‌ అధికంగా ఉంటుంది. ఎస్పెసో కాఫీ మధ్యస్థంగా చెప్పుకోవచ్చు. ఎల్‌డిఎల్‌ పెరగడాన్ని నివారించాలంటే ఇన్‌స్టాంట్‌ కాఫీని వాడకపోవడమే మంచిది.