మీ వంటలకు మైదాపిండిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారా?

మోహన్| Last Updated: సోమవారం, 27 మే 2019 (15:25 IST)
చాలా మంది మైదాపిండితో చేసిన పూరీ, బోండా, సమోసాలను ఎక్కువగా తింటుంటారు. వాటిని చూడగానే మనస్సును అస్సలు కంట్రోల్ చేసుకోలేరు. అయితే మైదాతో చేసిన వీటిని తింటే విషంతో సమానమని వార్తలు వస్తున్నాయి. అసలు మైదా మంచిదా కాదా అనేందుకు ఓ పెద్ద చర్చే జరిగింది. ఈ విషయంపై ఆరా తీస్తే చాలా విషయాలు బయటపడ్డాయి. 
 
నిపుణలు చెప్పిన ప్రకారం మైదా తింటే జీర్ణవ్యవస్థ పాడవుతుందన్నది నిజం కాదని చెప్తున్నారు. ఏదైనా సరే అధికంగా తీసుకుంటే సమస్య ఎదురవుతుందని, సరైన మోతాదులో తీసుకుంటే ఎలాంటి నష్టం జరగదని చెబుతున్నారు. అదే విధంగా మైదాను తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందని చెప్పడంలో నిజం లేదని చెబుతున్నారు. 
 
సరైన పద్ధతిలో తయారైన ఏ వంటకాన్నైనా సరే దానికి తగ్గట్టు వ్యాయామం చేస్తూ తగిన మోతాదులలో తీసుకుంటే ఎలాంటి సమస్యలు తలెత్తవని నిపుణులు సలహా ఇస్తున్నారు.దీనిపై మరింత చదవండి :