బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 27 మే 2019 (13:06 IST)

వేరుశెనగలు గుప్పెడు తింటే చాలట.. నూనెను వాడితే మాత్రం?

వేరుశెనగల్లో పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే వేరు శెనగలను రోజూ అరకప్పు మేర తీసుకుంటే సరిపోతుంది. అంతకుమించి తీసుకుంటే బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.


ముఖ్యంగా వేయించి ఉప్పు చల్లిన సాల్టెడ్ పల్లీలను తింటే వాటిల్లో ఉండే అధిక సోడియం కారణంగా అధిక బరువు పెరుగుతాపని వారు చెప్తున్నారు. అయితే నిత్యం శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారు, వ్యాయామం చేసే వారు, క్రీడాకారులు 3, 4 గుప్పెళ్ల వరకు వేరుశెనగలను తినవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
 
అలాగే వేరుశెనగ నూనెను వంటల్లో వాడటం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారమవుతాం. వేరుశనగ నూనెలో ఉన్న రెస్వెట్రాల్‌, పోలీఫెనాల్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధిక స్థాయిలో ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఈ సమ్మేళనం ఫ్రీ రాడికల్స్‌ తొలగించడానికి పనిచేస్తుంది. 
 
ఇంకా వేరుశనగ నూనె క్యాన్సర్‌ను నిరోధిస్తుంది. ఇందులోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ కణాలను నశింపజేస్తుంది. నూనెలో విటమిన్‌ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని సంరక్షిస్తుంది. ఇందులో ఉండే రెస్వెట్రాల్‌ ఆకట్టుకునే స్థాయిలో రోగనిరోధక వ్యవస్థను పటిష్టంగా ఉంచుతుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్‌ ప్రత్యేకించి వైరల్‌ అంటువ్యాధులను దూరం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.