దొండకాయ వేపుడును రోజూ తీసుకుంటే?
రోజూ మనం తీసుకునే ఆహారం కచ్చితంగా దొండకాయ వుండాలి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే.. దొండకాయలో జలుబు, దగ్గు, చర్మ సమస్యలను దూరం చేసే పోషకాలెన్నో వున్నాయి. అలాగే శరీర ఉష్ణోగ్రతను తగ్గించే గుణం దొండలో వుంది.
దొండకాయను రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే.. కుష్ఠు, వాత వ్యాధులు, మధుమేహం దరిచేరవు. దొండకాయ పచ్చడి, వేపుడు, కూరల రూపంలో ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలు నిలకడగా వుంటాయి. అంతేగాకుండా నోటిపూత, పెదవుల్లో పగుళ్లు ఏర్పడవు.
దొండకాయల్ని తరుచుగా తీసుకోవడం వల్ల మెటబాలిజం మెరుగుపడుతుంది. బరువుని అదుపు చేసుకోవాలి అనుకునేవారు ఈ దొండకాయల్ని తరుచుగా తీసుకోవడం వల్ల బరువును అదుపులో ఉంచుకోవచ్చు.
దొండకాయ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరంలో ఉప్పు శాతం కావాల్సిన దానికన్నా ఎక్కువైతే కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడుతాయి. కిడ్నీల్లో రాళ్ళు రాకుండా ఇవి అదుపు చేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.