Daily Horoscope
✕

మధుమేహానికి.. శృంగారానికి లింక్ ఏంటీ..?

Updated: శుక్రవారం, 28 డిశెంబరు 2018 (11:34 IST)
మధుమేహం వ్యాధి దాంపత్య జీవితంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పురుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గిపోయి అంగస్తంభన సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలను అధిగమించి శృంగారంలో సమర్థవంతంగా పాల్గొనాలంటే ఏం చేయాలీ...
 
మధుమేహ నియంత్రణలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ వద్దు. రక్తంలో షుగర్, కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవడం ప్రధానం. చికిత్స ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. రోజూ ఉదయాన్నే కనీసం 5 నుంచి 6 కిలోమీటర్లు కాస్త వేగంగా నడవండి. ఇది కేవలం లైంగిక సామర్థ్యాన్ని పెంచటానికే కాదు... మధుమేహం నియంత్రణలో ఉండటానికి, చక్కటి ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తుంది.
 
రోజూ సైక్లింగ్, ఈత.. ఈ రెండూ లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. పొత్తికడుపు, కటి ప్రాంత కండరాలను బలోపేతం చేసే కపాల భాతి, సర్వాంగాసనం వంటివి సాధన చేయండి. రోజూ తప్పనిసరిగా ఆకుకూరలు, పచ్చి కూర ముక్కలు, తీపి తక్కువుండే బొప్పాయి వంటి పండ్లు తీసుకోండి. ఏడెనిమిది బాదం పప్పులు, ఖర్జూర పండ్ల వంటివి తీసుకోండి. సాధ్యమైనంత వరకూ బీఫ్, మటన్ వంటి మాంసాహారాన్ని తగ్గించండి.
 
ముఖ్యమంగా మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వంటివి దరిచేరనీయవద్దు. భాగస్వామితో ఆహ్లాదంగా గడిపేందుకు ఎక్కువ సమయం కేటాయించండి. సమయానికి ఆహారం, చక్కటి వ్యాయామం, క్రమశిక్షణ పాటించడం, లైంగిక సామర్థ్యం తగ్గకుండా చూసుకోవడానికి దోహదం చేస్తాయి. ఎప్పుడైనా శృంగార భావనలు పెంపొందిచే సినిమాలు చూడటం కూడా మంచిదే. పొగతాగే అలవాటు ఉంటే తక్షణమే మానేయాలి. అదేవిధంగా బరువు పెరగకుండా చూసుకోవాలి. ఇవన్నీ చేస్తే శృంగార స్వర్గమయం అవుతుంది. 

అన్నీ చూడండి

Weather forecast: అక్టోబర్ 30, 2026 నాటి తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

నాకు పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా అమ్మాయిని ఇస్తారా?.. ఓ వ్యక్తి ప్రశ్న.. ఎందుకు?

అర్మేనియాలో చితక్కొట్టుకున్న ఎంపీలు... లైవ్ స్ట్రీమింగ్ చేసిన స్పీకర్

నాన్ డైరీ పనీర్‌పై నిషేధం విధించిన ఏపీ సర్కారు

నా మెడలో పుస్తెల తాడునే లాగుతారా? దొంగలకు దేహశుద్ధి చేసిన మహిళ, వీడియో

అన్నీ చూడండి

Bigg Boss Telugu 10: బిగ్ బాస్‌ 10.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్?

విమానంలో కీర్తి సురేశ్‌కు చేదు అనుభవం - మద్యం మత్తులో సెల్ఫీ కోసం యత్నం...

స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌: ఆఫ్టర్‌ డార్క్‌ ట్రైలర్‌ను విడుదల చేసిన జియో హాట్‌స్టార్‌

S.S. Rajamouli: భావోద్వేగ ప్రధానాంశంతో కథలను ఎలా చెప్పాలో వివరించిన ఎస్.ఎస్. రాజమౌళి

Manoj: కాళాంకి భైరవుడు’ థర్డ్ సింగిల్ విడుదల చేసిన మంచు మనోజ్

తర్వాతి కథనం