Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైదా పిండి వద్దే వద్దు.. పరోటాలు లాగిస్తే అంతే సంగతులు...

మైదా పిండితో చేసిన వంటకాలను తరచూ తింటున్నారా? అయితే ఈ కథనం చదవాల్సిందే. మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావాలి. జీర్ణం కావాలంటే తీసుకునే ఆహారంలో ఫైబర్ వుండాలి. లేదంటే కడుపులోని పేగులు దెబ్బతింటాయి. అయితే ఫ

Written By selvi
Updated: మంగళవారం, 17 అక్టోబరు 2017 (13:38 IST)
మైదా పిండితో చేసిన వంటకాలను తరచూ తింటున్నారా? అయితే ఈ కథనం చదవాల్సిందే. మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావాలి. జీర్ణం కావాలంటే తీసుకునే ఆహారంలో ఫైబర్ వుండాలి. లేదంటే కడుపులోని పేగులు దెబ్బతింటాయి. అయితే ఫైబర్ లేని మైదాపిండిని తీసుకుంటే మాత్రం జీర్ణ వ్యవస్థకు కష్టాలేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మైదా పిండితో చేసిన పదార్థాలు జీర్ణంకాక పేవులకు అలాగే అతుక్కుపోతాయి. దీంతో పేగుల్లో క్రిములు ఉత్పత్తి అవుతాయి. అవి ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. తద్వారా దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి రోగాలకూ దారితీస్తాయి.
 
మైదాపిండి వంటకాల ద్వారా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. మైదా పిండితో చేసే పరోటాలు ఇతరత్రా వంటకాలను తరచూ లాగిస్తే బరువు పెరగడమే కాకుండా.. పొట్టకూడా పెరిగిపోతుంది. మైదాలో క్లైకమిక్ ఇండెక్స్ ఎక్కువగా వుండటం వల్ల ఒంట్లో బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగే ప్రమాదం ఉంది.

గోదుమ పిండితో పోల్చితే సగం లేదా మూడో వంతు ధరకే లభించే మైదాను ప్రస్తుతం బేకరీ, హోటల్ ఫుడ్స్‌‌లో అధికంగా వాడుతున్నారు. కాబట్టి హోటల్ ఫుడ్ తీసుకోకపోవడం చాలామటుకు ఆరోగ్యానికి మేలు చేసినట్లవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments