శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By chj
Last Updated : ఆదివారం, 15 అక్టోబరు 2017 (21:02 IST)

రెండు నిమిషాల్లో దరిద్రం ఇలా వదిలించుకోవచ్చు...

కొన్నిసార్లు మనం దేనికో భయపడుతూ ఉంటాం. గుండె దడగా ఉంటుంది. ఏదో జరుగబోతున్నట్లు, ఎవరో మనల్ని వెంబడిస్తున్నట్లు అనిపిస్తుంటుంది. మనం ఎంత ఎదగాలన్నా ముందుకు వెళ్ళలేము. ఇలాంటి సమస్యను అధిగమించాలంటే ఓ మార్గ

కొన్నిసార్లు మనం దేనికో భయపడుతూ ఉంటాం. గుండె దడగా ఉంటుంది. ఏదో జరుగబోతున్నట్లు, ఎవరో మనల్ని వెంబడిస్తున్నట్లు అనిపిస్తుంటుంది. మనం ఎంత ఎదగాలన్నా ముందుకు వెళ్ళలేము. ఇలాంటి సమస్యను అధిగమించాలంటే ఓ మార్గం వుందని జ్యోతిష నిపుణులు చెపుతున్నారు. ఏడు జతల కర్పూర బిళ్లలు, ఏడు జతల లవంగాలు తీసుకొని రెండు లవంగాలను ఒకదానిపై ఒకటి పెట్టి అలాగే కర్పూరం ఒకదాని మీద ఒకటి పెట్టి పక్కపక్కనే అన్నింటిని గుండ్రంగా పేర్చాలి. 
 
ఇలా చేసిన తరువాత కర్పూరం వెలిగించడానికి వీలుగా ఉండే పరికరం తీసుకోవాలి. అందులో ఒక జంట కర్పూరాన్ని, ఒక జంట లవంగాలు వేసి ఇష్టదైవాన్ని జపిస్తూ ఇల్లంతా తిరిగి దాన్ని వెలిగించాలి. అలా వెలుగుతున్నప్పుడు రకరకాల శబ్దాలు వస్తాయి. ఇలా ఏడురోజుల పాటు చేయాలి. ఇలా చేస్తే చెడు దోషాలు, చెడు శక్తులు అంతమవుతాయి. ఇంటికి పట్టిన దరిద్రం వదులుతుందని విశ్వాసం.