ఆదివారం, 26 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By chj
Last Modified: సోమవారం, 25 సెప్టెంబరు 2017 (18:42 IST)

ఇంటి గడప దగ్గర పొరపాటున కూడా ఇలా చేయకూడదట...

సాధారణంగా మన ఇళ్ళలో పెద్దవారు ఏదో సమయంలో ఆ మాటా ఈ మాటా చెప్పడం తరచుగా వింటూనే ఉంటాం. చాలామంది ముఖ్యంగా యువత వీటిని మూఢ నమ్మకాలుగా భావించి కొట్టి పారేస్తూ ఉంటారు. కానీ మన పెద్దలు ఏది చెప్పినా ఖచ్చితంగా దాని వెనుక ఏదో ఒక పరమార్థం దాగి ఉంటుంది. దాని గుర

సాధారణంగా మన ఇళ్ళలో పెద్దవారు ఏదో సమయంలో ఆ మాటా ఈ మాటా చెప్పడం తరచుగా వింటూనే ఉంటాం. చాలామంది ముఖ్యంగా యువత వీటిని మూఢ నమ్మకాలుగా భావించి కొట్టి పారేస్తూ ఉంటారు. కానీ మన పెద్దలు ఏది చెప్పినా ఖచ్చితంగా దాని వెనుక ఏదో ఒక పరమార్థం దాగి ఉంటుంది. దాని గురించి నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 
 
తలుపు గడపపై కూర్చోకూడదు అనే నియమం మూఢనమ్మకం కాదు. సైన్స్ పరంగా ఇది ధృవీకరించడబడినది. డ్రోసింగ్ రాడ్ అనే శాస్త్రవేత్త కనుగొన్న తరువాత ఈ మాట అక్షరసత్యమని శాస్త్రీయంగా నిరూపితమైంది. ఇంటికి ప్రధాన ద్వారం పైన కూర్చోవడం మంచిది కాదు. అలా కూర్చుంటే అరిష్టం.. దరిద్రం కూడా. కిటికీలు, ద్వారాల ద్వారానే గాలి, వెలుతురు మన ఇంట్లోకి వచ్చి వెళుతూ ఉంటాయి. అలాంటప్పుడు మన ఇంట్లోకి వచ్చే గాలి, వెలుతురును ఇంటి లోపల గల నెగిటివ్ ఎనర్జీ బయటకు తీసుకెళ్ళే గాలిని గడపపై కూర్చుని అడ్డుకోవడం సైన్స్ పరంగా కూడా మంచిది కాదు.
 
చాలామంది గడప దగ్గర చిన్నచిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. గడపకు మధ్యలో కూర్చోవడం అస్సలు మంచిది కాదు. గడపకు కింద ఉన్న మెట్లపై కూర్చోవడం కూడా శ్రేయస్కరమే కాదు. అలా కూర్చుంటే ఇంటిలోకి వచ్చే లక్ష్మీదేవిని అడ్డుకున్నట్లేనని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు ప్రధాన ద్వారం అమర్చేటప్పుడు, పూజలు నిర్వహించి నవరత్నాలు, పంచలోహ వస్తువులను ప్రధాన ద్వారం గడప కింద ఉంచడం ఆనవాయితీ. అందుకే ప్రధాన ద్వారం అంటే గడపను దైవాంసంగా లక్ష్మీదేవిగా పూజిస్తాం. అలా కూర్చుంటే లక్ష్మీదేవిని అవమానించనట్లే అవుతుంది. అందుకే పూర్వీకులు గడపపైన నిలబడడం, ఎక్కి నిల్చోవడం లాంటివి చేయకూడదని చెబుతుంటారు.
 
కొంతమందైతే గడపపై తలగడ పెట్టుకుని పడుకుంటారు. ఇలా చేయడం కన్నా దరిద్రం మరొకటి ఉండదు. చెప్పులు వదిలి లోపలికి వెళ్ళేటప్పుడు కూడా గడపకు ఎదురుగా విడవకూడదు. గడపకు కుడి వైపున మాత్రమే చెప్పులు వదలాలి. ప్రతి శుక్రవారం గడపను శుభ్రం చేసి కుంకుమ బొట్లు పెడితే ఆ లక్ష్మీదేవి ప్రసన్నం పొందినట్లే.