Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడి పండ్లను ఇలా తింటే వేడి చేయదట?

Updated: బుధవారం, 22 మే 2019 (13:08 IST)
వేసవి వచ్చిందంటే చాలు మామిడి పండ్ల ప్రియులకు పండుగే. నోరూరించే ఈ ఫలరాజులో పోషకాలు బోలెడన్ని ఉంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. ఓ వైపు మామిడి పండ్లు నోరూరిస్తున్నప్పటికీ... వేడి చేస్తుందని భయపడి చాలా మంది మామిడి పండ్లు తినడానికి వెనుకంజ వేస్తూంటారు. 
 
కానీ రోజుకు ఒకటి లేదా రెండు మామిడి పండ్లను తినడం ద్వారా వేసవి తాపం నుండి తప్పించుకోవచ్చని న్యూట్రిషనిస్టులు చెప్తున్నారు. మామిడి పండ్లలో క్యుర్సెటిన్, ఫిసెటిన్, ఐసోక్యూరెసిట్రిన్, ఆస్ట్రాగాలిన్, గాలిక్ యాసిడ్, మిథైల్ గాలెట్ వంటి పలు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. 
 
మామిడి పండ్లు వేసవిలోని వేడిమి కారణంగా సహజంగా ఏర్పడే అలసట, డీహైడ్రేషన్ వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఆహారాన్ని మితంగా తీసుకోవాలనుకునేవాళ్లు మామిడి పండ్లు తింటే త్వరగా ఆకలేయదనీ, కడుపు నిండిన భావన కలుగుతుందని కూడా న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ముక్కలుగా కోసి మిక్సీలో వేసుకొని స్మూతీగానూ మామిడి రుచులను ఆస్వాదించవచ్చు.
 
మామిడి పండ్లను తినడం వల్ల శరీరానికి వెంటనే శక్తి అందడంతో రోజంతా ఉత్సాహంగా ఉంటారు. వీటిలో విటమిన్ ఎ, ఐరన్, కాపర్, పొటాషియం అధిక మోతాదుల్లో ఉంటాయి. మామిడి పండులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వీటిని ఉదయం, సాయంత్రం వేళల్లో తినడం వల్ల శరీరంలో కేలరీలు పేరుకుపోకుండా ఉంటాయి.
 
మామిడి పండ్లు తింటే బరువును పెరుగుతామనీ, వేడి చేస్తుందనీ చాలా మంది భావిస్తారు... కానీ రోజుకు ఒకటి లేదా రెండు మామిడి పండ్లను బేషుగ్గా లాగించేస్తే ఎలాంటి ఇబ్బందీ ఉండదంటున్నారు. మామిడి పండులో ఉండే చక్కెరలు, పీచు శరీరానికి మేలు చేస్తాయి. అప్పటికీ వేడి చేస్తుందనే భయం ఇంకా మీ మనసులో ఉంటే రాత్రి పడుకునే ముందు మామిడి పండ్లను నీళ్లల్లో వేసి.. ఉదయాన్నే తినండి. ఇలా చేయడం వల్ల అస్సలు వేడి చేయదు.

అన్నీ చూడండి

శుభమా అని గృహ ప్రవేశం చేస్తుంటే, రూ. 50 వేలు ఇవ్వలేదని హిజ్రాలు డ్రెస్ అంతా ఎత్తి చూపించారు, వీడియో

నవంబరు నుంచి కొన్ని రైళ్ల రాకపోకల వేళల్లో మార్పులు...

ప్రియురాలికి ఐ-ఫోన్ బహుమతి ఇచ్చేందుకు గంజాయి స్మగ్లింగ్, ఖమ్మం వద్దకు రాగానే...

మా అమ్మ గొంతును ఎవరూ నొక్కలేరు.. సీఎం రేవంత్‌ రెడ్డిని శపిస్తున్నాను : కొండా సుష్మిత

'మహారాష్ట్ర ఆడపులి' ముగ్గురు పిల్లలతో ఆత్మహత్య

అన్నీ చూడండి

సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ చిత్రం ధర్మన్ రెండవ షెడ్యూల్ పూర్తి

Ananya Nagalla: రెండు భిన్నమైన జోనర్లతో అనన్య నాగళ్ల చిత్రం లీసా సిద్ధం

వేణు ఊడుగుల సమర్పణ లో అడ్వెంచర్ మూవీగా చంద్రయాన్

Raj Tarun: టార్టాయిస్ యూనిక్ థ్రిల్లర్ మూవీ : రాజ్ తరుణ్

Naga Chaitanya :నాగ చైతన్య లాంచ్ చేసిన ది రేజ్ ఆఫ్ వారాహి సాంగ్

తర్వాతి కథనం
Show comments