Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

నిద్రించే ముందు మామిడి పండును తింటే.. ఏం జరుగుతుందో తెలుసా?

Updated: సోమవారం, 24 జూన్ 2019 (12:36 IST)
పండ్లల్లో రారాజు అయిన మామిడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వేసవిలో పుష్కలంగా లభించే మామిడిని తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మామిడిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా వున్నాయి. ఇవి అనేక వ్యాధులను దూరం చేస్తాయి. ముఖ్యంగా క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకుంటాయి. 
 
అంతేకాదండోయ్.. ఒబిసిటీ వున్న వారిలో చక్కెర స్థాయిల్ని కూడా మామిడి అదుపు చేయగలుగుతుంది. రక్తహీనతతో బాధపడేవాళ్లకి మామిడిలో ఐరన్‌ పుష్కలంగా దొరుకుతుంది. ఎసిడిటీ, అజీర్తిలతో బాధపడేవాళ్లకి మామిడి దివ్యౌషధంగా పనిచేస్తుంది. 
 
మానసికంగా బలహీనులైనవాళ్లకి దీని రసం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇందులోని ట్రిప్టోఫాన్‌ ఆనందాన్ని అందించే సెరటోనిన్‌ను విడుదల చేస్తుంది. ఇది ఏకాగ్రతనీ జ్ఞాపకశక్తినీ పెంచుతుంది. నిద్రలేమిని తగ్గిస్తుంది. అందుకే, నిద్రించేముందు ఓ మామిడిపండు తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
అంతేగాకుండా మామిడి పండులోని విటమిన్‌ ఎ, విటమిన్‌ ఇ పుష్కలంగా ఉండటం వల్ల యాక్నె సమస్య తగ్గుతుంది. చర్మంపై ముడతలు తొలగిపోతాయి.. తేమతో అందంగా కనిపిస్తుంది. బీటాకెరటిన్‌ పుష్కలంగా ఉండే మామిడిపండ్లు ఆస్తమా నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 
 
అలాగే మామిడిలోని పీచు శరీరంలోని వ్యర్థాలను బయటకు నెట్టి చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచుతుంది. మృతచర్మాన్ని తొలగించి చర్మరంధ్రాలని తెరుచుకునేటట్టు చేస్తుంది. దాంతో చర్మం కాంతితో మెరిసిపోతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments