ఈ సూప్ తాగితే కొలెస్ట్రాల్ కటాఫ్... ఎలా చేయాలో తెలుసా?
యాంటీఆక్సిడెంట్‌లు సమృద్ధిగా కలిగిన టొమాటో, రక్తాన్ని శుద్ధి చేయటమే కాకుండా కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, టొమాటోలో సమృద్ధిగా వున్నాయి. అలాంటి టొమాటోలతో సూప్ తయారు చేసుకుని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎలా చేయాలో చూద్దాం.
కావలసిన పదార్థాలు :
టొమాటోలు - ఆరు
కొత్తిమీర తరుగు- అరకప్పు
నీళ్ళు - ఆరు కప్పులు
ఉల్లిగడ్డ- 1
వెల్లుల్లి- 2 రేకులు
బిర్యానీ ఆకులు- 2
మిరియాలు- 3
వెన్న లేదా నెయ్యి - టీ స్పూను
ఉప్పు- తగినంత
క్యారెట్- 1
పంచదార- అర టీ స్పూను
తయారీ విధానం:
ముందుగా టొమాటో, క్యారెట్, నీళ్ళు, మిరియాలు, బిర్యాని ఆకులు, వెల్లుల్లి, ఉల్లిపాయ, పంచదార, పప్పులను కుక్కర్‌లో ఉడికించాలి. కుక్కర్ మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది. మెత్తగా అయిన టొమాటో మిశ్రమాన్ని ఫిల్టర్ చేసి మెత్తగా చేత్తో మెదిపి ఆ గుజ్జును కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. లేదా మిశ్రమాన్ని గ్రైండ్ చేసి గుజ్జును వడకట్టి తీసుకోవచ్చు. మరో పాన్‌లో వెన్న లేదా నెయ్యివేసి బ్రెడ్ ముక్కలను వేయించాలి. సూప్ తాగేముందు వేయించిన బ్రెడ్ ముక్కలను వేసి సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది.