Biodata Maker

మెంతికూరతో ఆరోగ్య ప్రయోజనాలేంటి?

Written By సందీప్
Updated: బుధవారం, 26 జూన్ 2019 (18:48 IST)
ఆకుకూరల వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనకు తెలుసు. ఆకుకూరలు తింటే కంటి చూపు మెరుగుపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండటం వలన మలబద్ధకం దూరం అవుతుంది. మెంతి ఆకుల వలన కూడా ఎన్నో ప్రయోజనాలను మనం పొందవచ్చు. మెంతి కూర తింటే శరీరానికి కావలసిన పోషకాలు కూడా పుష్కలంగా అందుతాయి. లివర్ సమస్యలను తొలగించడంలో మెంతికూర చక్కగా పనిచేస్తుంది. 
 
శ్వాసకోశ సమస్యలు తొలగిపోతాయి. మెంతి ఆకులు రక్తంలోని లిపిడ్ లెవల్స్‌పై మెరుగైన ప్రభావం చూపుతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈ ఆకులను నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని వడగట్టి తీసుకుంటే ఆరోగ్యానికి చక్కగా పనిచేస్తుంది. డయాబెటిస్‌ను నయం చేయడంలో బాగా పనిచేస్తుంది. 
 
మెంతి కూరలోని ఔషధ కారకాలు రక్తం గడ్డకట్టకుండా కాపాడతాయి. గుండె సంబంధ వ్యాధులు రాకుండా కాపాడతాయి. ఈ మెంతి కూరలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర కణజాలాన్ని రక్షిస్తాయి. చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడంలో మెంతి కూర చక్కగా పనిచేస్తుంది. ఈ మెంతి ఆకులను పేస్ట్‌లా చేసుకుని జుట్టుకు రాసుకుని అరగంట తరువాత తలస్నానం చేస్తే వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి.

అన్నీ చూడండి

వాటర్‌ బాటిల్‌పై రూ.7 ఎక్కువ వసూలు చేశాడు.. ఏడు లక్షలు జరిమానా కట్టాడు..

ఢిల్లీ వేదికగా బ్రిక్స్ సదస్సు... హాజరుకానున్న వివిధ దేశాధినేతలు

కులాంతర ప్రేమ వివాహం.. మరుసటి రోజే వరుడి ఇంటికి కూల్చేశారు.. ఎక్కడ?

పశ్చాత్తాపం అనే పదమే నా డిక్షనరీ లేదు : డోనాల్డ్ ట్రంప్

24 ఏళ్ల వ్యక్తికి, పొత్తికడుపులో గర్భాశయం.. షాకైన వైద్యులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

Varun Tej : వాయువ్ ముఖాన్ని చూపిస్తూ అందమైన జీవితంగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పోస్ట్

ఇరుముడి సైలెంట్ హిట్: పొంగిపోతున్న మాస్ మహరాజ రవితేజ, వీడియో

Epic movie review: బేబి జంట ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ సక్సెసా? కాదా? ఎపిక్ మూవీ రివ్యూ

అపుడు నటనకు పూర్తిగా స్వస్తి పలకాలని అనుకున్నాను : సమంత

బిగ్ బాస్ తెలుగులో బిగ్ ట్విస్ట్, ఏంటది?

తర్వాతి కథనం
Show comments