ఊబకాయాన్ని తరిమికొట్టాలంటే.. రోజూ దాల్చిన చెక్క టీ తాగితే..?
ఊబకాయాన్ని తరిమికొట్టాలంటే.. రోజూ దాల్చిన చెక్క టీ తాగితే మంచి ఫలితం వుంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఓ గ్లాసుడు నీటిని మరిగించి.. అందులో చెంచా దాల్చిన చెక్క పొడి వేసి పది నిమిషాల పాటు సన్నని సెగపై మరిగించి వడపోసి రోజూ ఉదయం సాయంత్రం అరకప్పు చొప్పున తీసుకుంటే ఒబిసిటీకి చెక్ పెట్టేయవచ్చు.
అలాగే బరువు తగ్గాలనుకునేవారు.. రెండు గ్లాసుల నీటిలో ఐదు చెంచాల నిమ్మరసం చేర్చి.. అందులో చెంచా నల్లమిరియాలపొడిని వేసి రెండుపూటలా కప్పు చొప్పున భోజనం తర్వాత ఓ గ్లాసు తాగాలి. దీనివల్ల రక్తంలో కొవ్వు తగ్గడమే కాకుండా తీసుకున్న ఆహారంలోని పోషకాలు పూర్తిగా వంటబడతాయి.
ఇంకా కప్పు నీటిని మరిగించి అందులో ఒక గ్రీన్ టీ బ్యాగ్ వేసి నాలుగు నిమిషాలు వుంచి.. చిటికెడు అల్లం తురుము కలిపి పరగడుపున తాగితే.. బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.