సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 5 నవంబరు 2018 (10:08 IST)

వర్షాకాలం, శీతాకాలంలో అల్లంను ఎందుకు వాడాలో తెలుసా?

వర్షాకాలం, శీతాకాలంలో శరీరానికి అల్లం చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ రెండు సీజన్‌లలో అల్లాన్ని ఆహారంలో చేర్చుకోవాలి. లేకుంటే అనారోగ్య రుగ్మతలు తప్పవు. రోజూ వంటకాల్లో అల్లాన్ని చేర్చడం ద్వారా కడుపు ఉబ్బరం, కడుపునొప్పి దూరమవుతుంది. ఇందులోని జింజరాల్ అనే ఔషధ గుణం శరీర ఉష్ణోగ్రతని అదుపులో వుంచుతుంది. ఇంకా జలుబు దగ్గు నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. 
 
గుండె జబ్బులు, కండరాల నొప్పులను అల్లం నివారిస్తుంది. అయితే గర్భిణీ స్త్రీలు మోతాదుకి మించి తీసుకోకూడదు. రోజుకి ఒక గ్రాముకి మించి అల్లాన్ని గర్భిణీ స్త్రీలు తీసుకోకూడదని వైద్యులు చెప్తున్నారు. అల్లాన్ని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రక్తపోటుని నియంత్రణలో ఉంచుకోవచ్చు.
 
వేడినీటిలో అల్లం ముక్కలు వేసి పది నిమిషాలు మరిగించి రెండు లేదా మూడు తేనె చుక్కలు వేసుకొని రోజుకి మూడుసార్లు తీసుకుంటే జలుబు మాయమవుతుంది. నీటిని మరిగించి అందులో అల్లం ముక్కలు వేసి మరిగించాలి. గోరువెచ్చగా అయిన తర్వాత పగిలిన పాదాలను అందులో వుంచితే ఉపశమనం ఉంటుంది. అల్లం మధుమేహాన్ని, గుండె జబ్బుల్ని నియంత్రించవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.